ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 37,875 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,96,718 కి చేరింది. ఇందులో 3,22,64,051 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా… 3,91,256 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 39,114 మంది డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇకపోతే, 24 గంటల్లో 369 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 4,41,411 కి చేరింది.