Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News India Becomes Worlds 3rd Largest Domestic Airline Market

Domestic Airline Market: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించిన ఇండియా..

Published Date :June 20, 2024 , 5:34 pm
By Venu Goapl Reddy
  • ఎయిర్‌లైన్ మార్కెట్‌లో ఇండియా రికార్డ్..
  • ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్..
  • తొలి రెండు స్థానాల్లో అమెరికా మరియు చైనా..
  • 10 ఏళ్ల క్రితం 5వ స్థానంలో దేశం..
Domestic Airline Market: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించిన ఇండియా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Domestic Airline Market: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, ఈ దశాబ్ధం చివరి నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు భారత విమానయాన రంగం కూడా గత దశాబ్ధకాలంలో బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించింది. 10 ఏళ్ల క్రితం 5వ స్థానంలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది.

10 ఏళ్ల క్రితం భారత్ దాదాపుగా 8 మిలియన్ల సీట్లతో 5వ డొమెస్టిక్ ఎయిర్ లైన్ మార్కెట్‌గా ఉండేది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉండేవి. అమెరికా, చైనాలు వరసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించింది. బ్రెజిల్, ఇండోనేషియాలను అధిగమించి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ సీట్ల ఎయిర్‌లైన్ సామర్థ్యంలో మూడో స్థానానికి చేరినట్లు OAG డేటా తెలిపింది.

Read Also: Vedhika: వేయడానికి 3 గంటలు.. తీయడానికి 2 గంటలు.. ‘యక్షిణి’ కష్టాలు బయటపెట్టిన వేదిక

10 ఏళ్ల సగటు కన్నా భారత్ సీటింగ్ సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. ఇది ఏటా 6.9 శాతం పెరుగుతోంది. ప్రస్తుతం 5 దేశీయ మార్కెట్లలో భారత వృద్ధి రేటు అత్యంత వేగంగా సాగుతోందని నివేదిక తెలిపింది. 2014-2024 మధ్య 6.3 శాతం వార్షిక వృద్ధితో చైనా వెనకబడి ఉందని, యూఎస్ఏ, ఇండోనేషియాలో కూడా చాలా తక్కువ వృద్ధి రేటు ఉందని నివేదిక తెలిపింది. OAG రిపోర్టు ప్రకారం.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే లో-కాస్ట్ క్యారియర్(LCC) కెపాసిటీ షేర్. ఏప్రిల్ 2024లో LCC భారత్‌లో దేశీయ ఎయిర్‌లైన్ సామర్థ్యం 78.4 శాతం వాటాను కలిగి ఉంది. తొలి 5 దేశాల డొమెస్టిక్ ఎయిర్‌లైన్ మార్కెట్లో భారత్‌దే అత్యధిక LCC వాటా కలిగి ఉంది.

గత 10 సంవత్సరాలలో, ఇండిగో వారి మార్కెట్ వాటాను దాదాపు రెట్టింపు చేసిందని, 2014లో 32 శాతం సామర్థ్యం నుండి నేడు 62 శాతానికి పెరిగిందని రిపోర్ట్ తెలిపింది. మిగిలిన మార్కెట్ కేవలం 0.7 శాతం మాత్రమే వృద్ధి చెందింది, అయితే ఇండిగోలో దేశీయ సామర్థ్యం వృద్ధి రేటు వార్షికంగా 13.9 శాతంగా ఉందని వెల్లడించింది. గతేడాది నవంబర్ 19న ఒక్క రోజే భారత్‌లో విమానయాన సంస్థలు 4,56,910 మంది దేశీయ ప్రయాణికులతో ప్రయాణించాయి. కోవిడ్ తర్వాత ఇదే అత్యధిక సింగిల్ డే ఎయిర్ ట్రాఫిక్. ఇది కోవడ్ ముందు సగటు కన్నా 7.4 శాతం పెరుగుదలను సూచిస్తుంది. గత 10 ఏళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి పెరిగిందని ప్రభుత్వం తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Global Airline Market
  • India Aviation Market
  • India Domestic Airline Market
  • World's 3rd Largest Domestic Airline Market

తాజావార్తలు

  • Athidhi Re-release: మహేష్ బాబు ‘అతిథి’ రీ-రిలీజ్.. మణిశర్మ సరికొత్త మ్యాజిక్!

  • Allu Aravind: మృణాల్‌ నువ్వు ఇక్కడే పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వు..

  • SPIRIT : ‘స్పిరిట్’ తెలుగు స్టేట్స్ రైట్స్ మైత్రి మూవీస్ & పీపుల్ మీడియా చేతికి

  • Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..

  • Hardik Pandya: ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.. ముంబై ఓటములపై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions