Site icon NTV Telugu

India Pakistan: భారత్ క్షిపణులతో దాడి చేసింది.. రాత్రి 2.30కి పాక్ ప్రధానికి ఆసిమ్ మునీర్ ఫోన్..

Pak

Pak

India Pakistan: ఎట్టకేలకు పాకిస్తాన్ క్రమంగా నిజాలను ఒప్పుకుంటోంది. తమపై భారత్ దాడి చేయలేదని, దాడి జరిగినా, పాకిస్తాన్ ఆర్మీ తిప్పికొట్టింది అంటూ విజయోత్సవాలు చేసుకున్న ఆ దేశ నేతలు, ఇప్పుడు నిజాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, తమపై భారత్ క్షిపణులతో దాడులు చేసిందని, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. మే 10 తెల్లవారుజామున భారత్ బాలిస్టిక్ క్షిపణులతో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు ఇతర ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిందిన ఆయన బహిరంగంగా ప్రకటించారు.

Read Also: Team India New Captain: టీమిండియా టెస్టు కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. గిల్- గంభీర్ కీలక భేటీ..

ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత్ తమ వైమానిక స్థావరాలపై దాడి చేసిందని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తనకు తెల్లవారుజామున 2.30 గంటలకు కాల్ చేసి చెప్పినట్లు షరీఫ్ వెల్లడించారు. “మే 9-10 తేదీల మధ్య రాత్రి, తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో, జనరల్ ఆసిఫ్ మునీర్ నాకు ఫోన్ ద్వారా కాల్ చేసి, భారతదేశం తన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని నాకు చెప్పారు. ఒకటి నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో, మరికొన్ని ఇతర ప్రాంతాలపై దాడి జరిగినట్లు చెప్పారు’’ అని అన్నారు.

రావల్పిండిలోని అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు పాకిస్తాన్‌ని ప్రధాన ఎయిర్ బేస్‌లైన సర్గోదా, జకోబాబాద్, స్కర్దు, రఫికీ మొదలైన 11 ఎయిర్ బేస్‌లపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు భారత్ ఆర్మీ శాటిలైట్ ఫోటోలతో చూపించింది. దీనికి ముందు, పాక్, పీఓకేలోని 09 ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసి, 100 మంది టెర్రరిస్టుల్ని హతమార్చింది. పాక్ వైమానిక దళం నిర్వీర్యం అయ్యేలా పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని భారత్ నాశనం చేసి సత్తా చాటింది.

Exit mobile version