India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
- మరోసారి యూఎన్‌లో పాకిస్తాన్ కాశ్మీర్ రాగం..
- ఇది మా అంతర్గత విషయం అని భారత్ ఘాటు రిప్లై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India At UN: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. దీనికి ప్రతిగా యథావిధిగా భారత్ చేతిలో అవమానాన్ని ఎదుర్కోంది. జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్గత విషయమని, తప్పుడు మరియు కల్పిత కథనాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల్ని ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి భద్రతా మండలి సమర్పించి వార్షిక నివేదికపై జరిగిన చర్చ సమయంలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించడంతో వివాదం చెలరేగింది. దీనిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వనేని హరీష్.. పాకిస్తాన్ వ్యాఖ్యలు అనవసరం, తప్పుదోవ పట్టించేవని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్యసమితిని వేదికగా ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమని మరోసారి భారత్ స్పష్టం చేసింది.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
పాకిస్తాన్ ఇలా అంతర్జాతీయ వేదికలపై జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. అన్ని సమయాల్లో భారత్ దీనిని తిప్పికొడుతోంది. పాకిస్తాన్ ముందుగా తన దేశంలో మానవహక్కులు, ఉగ్రవాద నిర్మూలనపై దృష్టిసారించాలని సూచించింది. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ ఆరోపిస్తోంది. అయితే, దీనికి ప్రతిగా భారత్ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ అంశాన్ని ప్రస్తావించింది. మైనారిటీలపై జరుగుతున్న దాడులను గుర్తుచేసింది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!