Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్‌లైన్స్ హెచ్చరిక..

  • ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి..
  • ఇంధన ధరల పెరుగుదలతో సంక్షోభంలో దేశ విమానయాన పరిశ్రమ..
  • భారీగా నష్టాలు వస్తాయని విమాన సంస్థల ఆందోళన..
  • కేంద్రానికి ఎయిర్‌ ఇండియా లేఖ..
Oil Crisis

Oil Crisis

Airlines Crisis: ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం భారత విమానయాన రంగాన్ని సంక్షోభానికి గురిచేస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల మూలంగా ఎయిర్‌లైన్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యలో ఇంధన ధరల కారణంగా విమాన కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమాన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా సహా కనీసం మూడు ఎయిర్‌లైన్స్ ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నాయి. విమాన ఇంధనం ‘‘ఏవియేషణ్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలను సవరించాలని కోరాయి. విమాన కార్యకలాపాల ఖర్చులో 40 శాతం ఖర్చు ఇంధనానిదే ఉంటుంది. ఇప్పుడు నిర్వహణ ఖర్చులలో ఇది 55–60% వరకు పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇంధన ధరలు ప్రస్తుతం ప్రతీ కిలోలీటర్ కు రూ. 2 లక్షలకు పైగా చేరాయి.

Read Also: The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!

ఈమేరకు విమాన సంస్థలు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. ఇంధన ధరలు పెరిగితే ఎయిర్‌లైన్స్ భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, ఫ్లైట్లను రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, స్పైస్ జెట్ కేంద్రానికి లేఖ రాశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రూట్లపై ప్రభావం ఎక్కువగా ఉందని, ఇలాగే కొనసాగితే రూట్లలో ఫ్లైట్లను నిలిపేయడం లేదా తగ్గించడం చేయాల్సి వస్తుందని ఎయిర్‌లైన్స్ చెబుతున్నాయి.

దేశీయ, అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలు సమానంగా ఉండాలని, తాత్కాలికంగా 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని వాయిదా వేయాలని, కొన్ని ప్రాంతాల్లో 25 శాతం వరకు ఉండే రాష్ట్ర స్థాయి వ్యాట్‌ను తగ్గించాలని, ఇంధన ధరల పెరుగుదలపై నియంత్రణ ఉండాలని కొన్ని కీలక డిమాండ్లు చేశాయి. ఇరాన్ యుద్ధం వల్లే ఈ ఇంధన ధరల పెరుగుదల నమోదవుతోంది. ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని అడ్డుకోవడంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి వచ్చే చమురుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలో చమురు, గ్యాస్ రవాణా 20 శాతం జరుగుతోంది.