Quantum Technology: చరిత్ర సృష్టించిన భారత్.. “క్వాంటం కమ్యూనికేషన్ టెక్నాలజీ” సక్సెస్
- క్వాంటం టెక్నాలజీలో కీలక మైలురాయిని చేరిన భారత్..
- 1000 కి.మీల క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్ సక్సెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quantum Technology: భారతదేశం చరిత్ర సృష్టించింది. టెక్నాలజీలో భారీ ముందడుగు పడింది. భారత్ స్వదేశీ టెక్నాలజీతో 1000 కి.మీ క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్ను విజయవంతంగా పరీక్షించింది. ఇది దేశ భద్రత, డేటా సెక్యూరిటీకి అతిపెద్ద బలంగా మారనుంది. జాతీయ క్వాంటం మిషన్ (NQM) కింద భారతదేశం రెండు సంవత్సరాల కన్నా తక్కువ కాలంలోనే 1,000 కిలోమీటర్ల క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్ను విజయవంతంగా ప్రదర్శించింది. నిజానికి 8 ఏళ్లలో 2000 కిలోమీటర్లు లక్ష్యాన్ని పెట్టుకుంటే, రెండేళ్లలోనే 1000 కి.మీలు పూర్తి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డ్. ఈ టెక్నాలజీ ద్వారా డేటాను హ్యాక్ చేయని విధంగా పంపించొచ్చు. ఎవరైనా డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తే గుర్తించవచ్చు. దీనిని అన్ బ్రేకబుల్ ఎన్‌క్రిప్షన్ అని కూడా అంటారు.
Read Also: Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
ఈ టెక్నాలజీలో క్యూన్యూ లాబ్స్ కీలక పాత్ర పోషించింది. ఈ విజయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైన క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) వ్యవస్థలలో ఒకటిగా నిలిచి, భారతదేశ క్వాంటం-సురక్షిత భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ఈ విజయం ద్వారా భారత రక్షణ, ఆర్థిక వ్యవస్థలు, కీలక మౌలిక సదుపాయాల సురక్షిత కమ్యూనికేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయనుంది. ఈ సాంకేతికత ద్వారా నీటి అడుగున, భూగర్భ నెట్వర్క్‌లతో సహా సవాలులో కూడిన భూభాగాల్లో కూడా మెరుగైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఫైబర్ అవసరం లేకుండా సేవలు అందించవచ్చు. భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్, సెన్సింగ్ వంటి రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది.
గతంలో డీఆర్డీఓ కూడా క్వాంటం కమ్యూనికేషన్‌పై ప్రయోగం చేసింది. 1 కి.మీ దూరంలో సెక్యూర్ డేటా ట్రాన్స్‌మిషన్ సాధించింది. రియల్ టైమ్‌లో కూడా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని నిరూపించింది. నిజానికి భారత ప్రభుత్వం 2023లో ఈ మిషన్ కోసం బడ్జెట్‌లో రూ. 6000 కోట్లకు పైగా కేటాయింపులతో జాతీయ క్వాంటం మిషన్ (NQM)ను ఆమోదించింది. క్వాంటం కమ్యూనికేషన్లో చైనా నెంబర్ వన్‌గా ఉంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, యూకేలు కూడా ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!