CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసిన బెంగాల్ నటి
- విజయ్ పరిపాలనపై ప్రశంసలు కురిపించిన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను బెంగాల్ నటి, తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీ సయానీ ఘోష్ కలిశారు. చెన్నై సచివాలయంలో విజయ్ను కలిసి రాష్ట్ర సుపరిపాలనను, దార్శనికతను ప్రశంసించారు. అనంతరం విజయ్‌తో సయానీ ఘోష్ సెల్ఫీ దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ముఖ్యమంత్రితో సమావేశమైన అనంతరం సయోని ఘోష్ మాట్లాడుతూ.. విజయ్ పశ్చిమ బెంగాల్ గురించి ఆప్యాయంగా మాట్లాడారని.. గొప్ప సంస్కృతి, సంప్రదాయాల పట్ల తన ప్రశంసలను వ్యక్తం చేశారని తెలిపారు. సయానీ ఘోష్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తలపతి విజయ్ సినిమాలోని ఒక పాటతో పాటు ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ‘‘ఆయన ఆత్మీయ ఆతిథ్యానికి నేను కృతజ్ఞురాలిని. తన రాష్ట్రం కోసం తన దార్శనికతను నెరవేర్చుకునే దిశగా ఆయన చేస్తున్న కృషికి నా శుభాకాంక్షలు.’’ అని రాశారు.
సమావేశం సందర్భంగా సయానీ ఘోష్ ముఖ్యమంత్రి విజయ్‌తో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఘోష్.. సీఎం విజయ్‌తో సమావేశానికి సంబంధించిన ఫొటోలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఒక ఫొటోలో విజయ్‌కి ఏదో ఇస్తూ కనిపించారు. అయితే విజయ్ను ఎందుకు కలిశారో సాయోని వెల్లడించలేదు.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి.. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన సయానీ ఘోష్‌కు.. ముఖ్యమంత్రి విజయ్‌కు మధ్య జరిగిన సమావేశం ప్రాంతీయ పార్టీల మధ్య ఒక కొత్త సంభాషణకు సంకేతంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరు నాయకులు తమ తమ రాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన సాంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయాలుగా ఎదిగారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఇద్దరూ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. విజయ్ తమిళ, దక్షిణాది చిత్రసీమలో సూపర్‌స్టార్ కాగా.. సయానీ ఘోష్ బెంగాలీ చిత్రాల్లో పనిచేశారు.
It was a pleasure meeting the Hon’ble Chief Minister of Tamil Nadu,
Thiru C. Joseph Vijay.
While sharing his thoughts on Tamil Nadu & its future rooted in inclusive growth, opportunity and good governance he also expressed his fondness for West Bengal, its rich culture and… pic.twitter.com/Dr0maxEN1z— Saayoni Ghosh (@sayani06) September 1, 2026
తాజావార్తలు
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!