NTV Telugu Site icon

Uttar Pradesh: సమ్మర్ ఎఫెక్ట్.. విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన

Up

Up

దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఎండల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్తున్నారు. బయటకు వెళ్తే టోపి లేదా రూమాలు కట్టువాలంటున్నారు. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగాలని.. ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగుతుండాలని చెబుతున్నారు.

Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై..

మరోవైపు.. ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. పాఠశాల విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తరగతి గదుల్లో ఒకదానిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు ఉపాధ్యాయుడు.

Amit Shah: ముగ్గురు నిందితుల అరెస్ట్, ముఖ్యమంత్రికి సమన్లు… అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఏం జరుగుతుంది?

అందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మహసౌనాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్‌లో చాలా మంది విద్యార్థులు ఉల్లాసంగా ఉన్నట్లు చూడొచ్చు. విపరీతమైన ఎండల వల్ల విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం లేదని, ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని పాఠశాల ప్రిన్సిపాల్ వైభవ్ రాజ్‌పుత్ తెలిపారు. ఈ వినూత్న ఆలోచనతో “ఇప్పుడు పిల్లలు స్కూల్ కి రావడం మొదలుపెట్టారు. చదువుకోవడం అయిపోగానే విద్యార్థులంతా క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్లో పడుకుని ఎంజాయ్ చేస్తున్నారు” అని ప్రిన్సిపాల్ తెలిపారు.