NTV Telugu Site icon

Shaktikanta Das: ఆర్బీఐ గవర్నర్గా తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు..

Shakthi Kanth Das

Shakthi Kanth Das

Shaktikanta Das: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ రోజు ( డిసెంబర్ 10) పదవి విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.. అందులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్బీఐ బ్యాంక్‌కు నాయకత్వం వహించే అవకాశం ఇవ్వడంతో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. గత ఆరేళ్లలో ఆర్థిక- ద్రవ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందని శక్తికాంత్ దాస్ అన్నారు.

Read Also: Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పేషీకి ఫోన్‌ చేసిన వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు

ఇక, మిగులు బదిలీ, రెగ్యులేటర్ స్వయం ప్రతిపత్తి విషయంలో ఆర్‌బీఐకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన గొడవలతో ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. 2018 డిసెంబర్ లో ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతను మిగులు బదిలీకి సంబంధించిన వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించారు. అలాగే, మార్కెట్లో ఒడిదుడుకులను తగ్గించారు. ఆయన హయాంలో ఆర్బీఐ ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ అత్యధికంగా రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్ ఫండ్ ఇచ్చింది.

Read Also: Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్‌కు కెనడా ప్రధాని ట్రూడో వార్నింగ్..

అలాగే, నోట్ల రద్దుతో పాటు జీఎస్టీ అమలులో శక్తికాంత్ దాస్ కీలక పాత్ర పోషించారు. తమిళనాడు కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి అయిన దాస్.. మే 2018లో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం, జీ20 షెర్పా ఆఫ్ ఇండియా సభ్యునిగా అతడు ఎన్నికయ్యాడు. అలాగే, తన సుదీర్ఘ పదవీకాలంలో 8 కేంద్ర బడ్జెట్ల తయారీతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాడు శక్తికాంత్ దాస్.