Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర యూనిట్ రద్దు
- కాంగ్రెస్ సంచలన నిర్ణయం
- హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర యూనిట్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర విభాగాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీసీసీ రాష్ట్ర యూనిట్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల మొత్తం రద్దు ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: KA : ‘క’ సినిమా పాన్ ఇండియా రిలీజ్ డేట్స్ ఇవే.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
హిమాచల్ మంత్రి అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ని నియమిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఇది సాధారణ చర్యగా పేర్కొన్నారు. పీసీసీ, డీసీసీ, బ్లాక్ యూనిట్ల పదవీకాలం ముగిసినందున వాటిని రద్దు చేయాలనేది హిమాచల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కాగా ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఇటీవల హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారు. దీని ద్వారా కొత్త కమిటీలలో క్రియాశీల సభ్యులకు ప్రాధాన్యత లభిస్తుందని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి: Kamala harris: కమలాహారిస్ ఓ యోధురాలు.. కొనియాడిన తమిళనాడు వాసులు
2019లో కూడా ఇదే విధమైన కసరత్తు జరిగింది. కాంగ్రెస్ తన రాష్ట్ర విభాగాన్ని రద్దు చేసినప్పటికీ.. ఆ సంవత్సరం ప్రారంభంలో నియమించబడిన ప్రెసిడెంట్ కులదీప్ సింగ్ రాథోడ్‌ను కొనసాగించింది. ప్రతిభా సింగ్ 2022లో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవికి ముందున్న వారిలో ఒకరిగా కనిపించారు. కానీ ఆ పదవి సుఖ్వీందర్ సింగ్‌కి దక్కింది.
Hon'ble Congress President has approved the proposal to dissolve the entire state unit of the PCC, District Presidents and Block Congress Committees of Himachal Pradesh Congress Committee, with immediate effect. pic.twitter.com/xofu5vPRyy
— INC Sandesh (@INCSandesh) November 6, 2024
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?