కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర విభాగాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీసీసీ రాష్ట్ర యూనిట్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల మొత్తం రద్దు ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారు.