ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! ఐఎండీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Read Also: అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. మంత్రి, మరో ఎమ్మెల్యే రాజీనామా..
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
రానున్న నాలుగైదు రోజుల పాటు అరేబియా, బంగాళాఖాతం నుంచి గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ.. వీటి ప్రభావంతో.. పలు రాష్ట్రాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఈ నెల 14వ తేదీ వరకు విదర్భ, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, హర్యానాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలింది… రానున్న రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్‌లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందన్న ఐఎండీ.. 11, 13 తేదీల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని.. 13న విదర్భలో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో వర్షం కురవవచ్చునని అంచనా వేసింది.. ఇక, 11న చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, గంగానది పశ్చిమ బెంగాల్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 12వ తేదీన తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. 11, 12, 13 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో చాలా విస్తృతమైన వర్షపాతం, మంచు కురిసే అవకాశం ఉంటుందని, 12, 13 తేదీల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!