అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాక్‌.. మంత్రి, మరో ఎమ్మెల్యే రాజీనామా..

త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది.. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గోవాలో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్‌ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీజేపీ షాకిస్తూ.. రాష్ట్ర మంత్రి మైఖేల్‌ లోబో రాజీనామా చేశారు.. మరో ఎమ్మెల్యే ప్రవీణ్‌ జాంతే కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. కలంగుటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మైఖేల్‌, నౌకాశ్రయాలు, వ్యర్థ్యాల నిర్వహణ శాఖకు మంత్రిగా పనిచేస్తున్న ఆయన.. అనూహ్యంగా పార్టీని వీడడం చర్చగా మారింది..

Read Also: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌.. తొలి సిరీస్‌ కోసం టీమిండియా ఆరాటం..!

ఇక, బీజేపీ ప్రజల పక్షాన లేదని అందుకే పార్టీని వీడుతున్నట్లు వివరించారు మైఖేల్‌. అయితే, మైఖేల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.. మరోవైపు బీజేపీకి రాజీనామా చేసిన మయం నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రవీణ్‌ జాంతే.. తన నియోజకవర్గాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని.. ఆ సమస్యకు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపడం లేదని విమర్శించారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల ముందే.. ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే బీజేపీకి రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.

Related Articles

Latest Articles