NTV Telugu Site icon

Heavy Rain Alert: నాలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. మరో తొమ్మిది స్టేట్స్ కి ఆరెంజ్ అలర్ట్..!

Rain Alert

Rain Alert

Heavy Rain Alert: దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలంగాణ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో ఇవాళ (శనివారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఛత్తీస్ గఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ.

Read Also: Secunderabad Bonalu: రేపే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్ష‌లు..

ఇక, అల్పపీడన ద్రోణి వాయువ్య దిశగా పయనించి తెల్లవారుజామున వాయుగండంగా పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే ఛాన్స్ ఉండటంతో వాతావరణ శాఖ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉందని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 21, 22 తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో పాటు ఈ నెల 23 వరకు మధ్యప్రదేశ్ కు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

Read Also: Raj Tarun: వివాదాల నడుమ ‘పురుషోత్తముడు’గా రాజ్ తరుణ్

కాగా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నికోబార్ దీవులు, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో జూలై 24 వరకు వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. అలాగే, ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ వెల్లడించింది.