NTV Telugu Site icon

IMD Warning: ఉత్తర భారత్‌కు హీట్‌వేవ్ వార్నింగ్.. 3 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచన

Imdwarning

Imdwarning

ఉత్తర భారత్‌కు ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలో వేడిగాలులు వీస్తాయని తెలిపింది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: MS Dhoni: ఆ నలుగురు టీమిండియా ఆటగాళ్లతో మళ్లీ ఆడాలనుంది: ధోనీ

ఇదిలా ఉంటే రాజస్థాన్‌లోని బార్మె్ర్‌లో కొత్త రికార్డ్‌ను సృష్టించింది. ఆదివారం 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ మొదటి వారంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. అంటే సాధారణం కంటే 6.8 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కూడా వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: YS Jagan: రేపు రామగిరిలో వైఎస్ జగన్‌ పర్యటన..