‘పుష్ప’రాజ్ మాయలో పిల్లలు… అడ్డంగా దొరికేశారే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన “పుష్ప” సినిమా నిన్నటి నుంచి డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రన్ నుంచి సమంత సాంగ్ వరకు ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్లు సాధించింది. కరోనా సమయంలో కూడా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ఈ సినిమా సత్తా చాటింది. అయితే ఈ సినిమా చూస్తూ తమిళనాడులో స్కూల్ విద్యార్థులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

Read Also : ఓటిటిలో కూడా పోటీనా? నాని వర్సెస్ బాలయ్య!

అసలు విషయం ఏంటంటే… ‘పుష్ప’ సినిమా తెలుగుతో పాటు హిందీ’ తమిళ’ కన్నడ’ మలయాళ భాషలలో కూడా విడుదలైంది. అయితే తమిళనాడులోని కడలూరు పట్టణంలో ఒక థియేటర్లో సినిమా చూస్తున్న స్కూల్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వారంతా స్కూల్ పేరు చెప్పి ఇంటి నుంచి నేరుగా దియేటర్లకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతానికి 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లను నడపడానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లో నడుస్తున్నాయా ? లేదా ? అని అధికారులతో పాటు పోలీసులు తనిఖీలకు వచ్చారు. అదే సమయంలో స్కూల్ ఎగ్గొట్టి సినిమా చూస్తున్న విద్యార్థులు కనపడటంతో వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలి పెట్టారట పోలీసులు. మొత్తానికి పిల్లలు కూడా ‘పుష్ప’రాజ్ మాయలో పడిపోయారన్న మాట!!

Related Articles

Latest Articles