IIT Delhi ex-students launch New electric scooter For Just 35k: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే హవా! పెరుగుతున్న పెట్రోల్ రేటుని అధిగమించేందుకు.. ప్రయాణికులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ స్కూటర్ తయారీ కంపెనీలు ఒకదానికి మించి మరొకటి అద్భుతమైన ఫీచర్స్‌తో వాహనాల్ని దింపుతున్నారు. ఇప్పటికే బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్, ఈథర్‌తో మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో దూసుకుపోతున్నాయి. కొత్త స్టార్టప్స్ కూడా వస్తున్నాయి. అయితే.. ఈ కంపెనీలు తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 80 వేలు నుంచి రూ. 1 లక్ష వరకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త స్టార్టప్.. ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొచ్చింది.
YES Bank : అద్భుతమైన కొత్త వడ్డీ పథకాన్ని తీసుకొచ్చిన యస్ బ్యాంక్
ఆ స్టార్టప్ పేరు బాజ్ బైక్స్. ఈ ఐఐటీ ఢిల్లీ బేస్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ బాజ్ బైక్స్.. లేటెస్ట్‌గా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసింది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇతర కంపెనీలకు గట్టి పోటీనివ్వాలంటే, ప్రయాణికుల్ని ఆకర్షించగల ప్రణాళికల్ని సిద్ధం చేయాలి. ఈ కంపెనీ కూడా అలాంటి తెలివైన పనే చేసింది. ఇతర సంస్థలకు భిన్నంగా.. చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రంగంలోకి దింపింది. ఈ బైక్ పేరు బాజ్ బైక్స్. దీని ధర కేవలం రూ. 35 వేలు. తక్కువ ధర ఉంది కదా.. ఫీచర్లు గొప్ప ఉండవని భావిస్తే, పప్పులో కాలేసినట్టే! ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏమిటంటే.. బ్యాటరీ స్వాపింగ్ ఫెసిలిటీ. అంటే.. బ్యాటరీ చార్జ్ అయిపోతే, దాని స్థానంలో మరొక బ్యాటరీ మార్చుకోవచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కేవలం 90 సెకన్లలోనే బ్యాటరీని మార్చుకోవచ్చు. ఇలా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్‌లో బ్యాటరీ మార్చుకుంటూ.. నాన్‌స్టాప్‌గా ప్రయాణం చేయొచ్చు.
Notices to MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు CRPC 91 నోటీస్.. ఎందుకు ఇస్తారు?
ఒక్కసారి చార్జింగ్ పెడితే.. ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఈ స్కూటర్ గరిష్ట స్పీడ్.. గంటకు 25 కిలోమీటర్లు. ఇందులో డ్యూయల్ ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. వెనుక భాగంలో డ్యూయెల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. అందువల్ల స్కూటర్ స్మూత్‌గానే వెళ్తుంది. వర్షం, దుమ్ము వంటి వాటికి ఈ స్కూటర్ పాడవకుండా ఉండేందుకు.. వీటికి ఐపీ65 రేటింగ్ అమర్చారు. దీని పొడవు 1624 ఎంఎం, వెడల్పు 680 ఎంఎం, ఎత్తు 1052 ఎంఎం ఉంటుంది. ఈ వెహికల్‌కు ఎలాంటి రిజిస్ట్రేషన్ గానీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ గానీ అవసరం లేదు.