YES Bank : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించింది. రూ.రెండు కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)పై వడ్డీలో ఈ మార్పు చేపట్టింది. కొత్త రేట్లు డిసెంబర్ 9 నుండి అమలులోకి వచ్చాయి. యస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లు 8 శాతం వడ్డీ రేటు పొందాలంటే 30 నెలల పాటు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో, బ్యాంక్ సాధారణ ప్రజలకు ఈ కాలానికి చెందిన ఎఫ్ఢీలపై 7.50 శాతం వడ్డీ రేటుగా నిర్ణయించింది. ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 3.25 శాతం నుంచి 6.75 శాతం వరకు యస్ బ్యాంక్ వడ్డీని అందిస్తోంది. యస్ బ్యాంక్ వృద్ధుల కోసం 8 శాతం వడ్డీ రేటుతో 30 నెలల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది.
Read Also: Crude Oil : దిగొచ్చిన రష్యా.. పాకిస్తాన్కు క్రూడాయిల్ సరఫరాకు ఓకే
యస్ బ్యాంక్ 15 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 3.70 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 46 రోజుల నుండి 90 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలకు 4.10 శాతం వడ్డీ, 91 రోజుల నుండి 180 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలకు 4.75 శాతం వడ్డీ లభిస్తుంది. అంతే కాకుండా 181 రోజుల నుండి 271 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై బ్యాంక్ 5.50 శాతం వడ్డీ, 272 రోజుల నుండి ఒక ఏడాది పాటు ఉంచే ఎఫ్డీ పై 5.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఏడాది నుండి 36 నెలల FDలలో పెట్టుబడి మొత్తంపై 7శాతం చొప్పున వడ్డీ అందిస్తోంది. యస్ బ్యాంక్ 36 నెలల నుంచి ఐదేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది.
Read Also: Ring Recovery: అక్కడ ఇరుక్కున్న ఉంగరం.. అగ్నిమాపక సిబ్బంది ఎలా రక్షించారంటే?
ప్రత్యేక FD పథకం
అంతకుముందు, అక్టోబర్ 12, 2022న, బ్యాంక్ 20 నుండి 22 నెలల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో, సాధారణ ప్రజలు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లు 7.75 శాతం చొప్పున డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని పొందుతున్నారు. 9 డిసెంబర్ 2022న, యస్ బ్యాంక్ 30 నెలల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో డబ్బును డిపాజిట్ చేస్తే, సాధారణ ప్రజలు 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం చొప్పున వడ్డీని పొందుతారు.