Rajeev Chandrasekhar: “భారత్‌తో యుద్ధానికి దిగితే మీ పిల్లల్ని వేరే వాళ్లు పెంచుతారు”.. కేంద్రమంత్రి మాస్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajeev Chandrasekhar: జమ్మూకాశ్మీర్‌లో అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ ఐదు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు ఆర్మీ అధికారులు వీర మరణం పొందారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండల్లో దాగున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ తో యుద్ధం చేయాల్సి వస్తే మీ పిల్లల్ని వేరేవాళ్లు పెంచుతారని ఎక్స్(ట్విట్టర్) పోస్ట్ చేశారు.
కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారతదేశ శతృవులను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా భారత్ పై యుద్ధానికి వస్తే వారి పిల్లల్ని వేరే వాళ్లు పెంచుతారంటూ హెచ్చరించారు. ‘భారత్ చాలా యుద్ధాలు చూసిందని, భారత్ ఎప్పుడూ యుద్ధం కోరుకోదని, కానీ భారత్ తో యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం మీ పిల్లల్ని మరొకరు పెంచుతారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇది న్యూ ఇండియా అని వెనక్కి తగ్గి, బెదిరిపోదని కేంద్రమంత్రి అన్నారు.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
Read Also: Kamal Haasan: నన్ను రజినీకాంత్ ని మించిన ఫ్రెండ్స్ ఈ జనరేషన్ లోనే లేరు…
భారతదేశానికి శతృవులు ఉన్నారు. ఈ శతృవులు భారత దేశాన్ని ఎదగనివ్వద్దని కోరుకుంటలారు. అయితే వారు భారత మిలిటీర ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా, హైటెక్ గా ఉందని, ప్రాణాలు తీసే యంత్రమని, దానితో తప్పు చేయవద్దని, దాన్ని తప్పించుకోవడమే తెలివైందని ఆయన అన్నారు. సైన్యం అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని వాడటాన్ని ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉగ్రవాదులను ఎలాగైనా హతం చేయాలని భద్రతా బలగాలు కసితో వేట సాగిస్తున్నాయి. అయితే దట్టమైన అడవులు, కొండలు గుహలు ఉగ్రవాదులకు ఆసరాగా మారుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అనంతనాగ్ ఆపరేషన్‌లో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్ భట్, రైఫిల్‌మెన్ రవికుమార్ రాణా సహా నలుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. ఇదిలా ఉంటే శనివారం బారాముల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.
India has enemies – These enemies want to stop Indias rise. But they should know this.
Indian Military is now a modernized high tech and lethal machine – make no mistake about it. You will be wise to avoid it.
This is NewIndia – India will not be intimidated , India will not… https://t.co/dapF7JV3qC
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) September 17, 2023
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!