Lok Sabha Speaker: ఇప్పట్లో లోక్‌సభకు రాను…. అధికార, విపక్షాల తీరుపై స్పీకర్ అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Speaker: లోక్‌సభలో అధికార, విపక్షాలు వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు పక్షాల సభ్యులు తమ తీరును మార్చుకునే వరకు తాను లోక్‌సభకు రానని స్పష్టం చేశారు. మణిపూర్ అంశంపై చర్చకు సంబంధించి ఇటు విపక్షాలతోపాటు.. అటు అధికార పక్షం వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మణిపూర్ అంశంపై దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. అలాగే చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మణిపూర్ అంశంపై స్వల్ప కాలిక చర్చ చేపడతామని.. చర్చకు హోం శాఖ మంత్రి అమిత్ సమాధానం ఇస్తారని చెబుతోంది. దీంతో పార్లమెంటు సమావేశాలు స్థంభిస్తున్నాయి. మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే ఈ వ్యవహారాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించారు. ఎంపీల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు తాను సభలో అడుగుపెట్టబోనంటూ ప్రకటించారు.
Read also: Baby Movie: బేబీ టీంపై సంచలన ఆరోపణలు.. ఇక నోరు మూసుకుంటానంటూ డైరెక్టర్ ట్వీట్!
Also Read
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపైనా స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు జరగకుండా ఇరు పక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సెషన్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను తిరిగి సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారాయన. ఇక మణిపూర్ నినాదాల నడమే ఇవాళ్టి లోక్‌సభ జరగలేదు. రేపటికి సభ వాయిదా పడింది. మణిపూర్ అంశంపై రూల్ 267 ప్రకారం సుదీర్ఘ చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి…. ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగా.. రూల్ 176 ప్రకారం స్వల్పకాలిక చర్చతోనే సరిపెడతామని.. చర్చకు కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెబుతారని కేంద్రం చెబుతోంది. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సక్రమంగా జరగడం లేదు.
Lok Sabha Speaker Om Birla has expressed deep displeasure with both the ruling party and the opposition over the functioning of the House. Birla told both sides that he will not come to Lok Sabha until MPs behave according to the dignity of the House. Even today, when the…
— ANI (@ANI) August 2, 2023
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!