Baby Director sai Rajesh Sensational Tweet: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బేబీ కూడా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన బేబీ సినిమా నాలుగున్నర కోట్ల రూపాయల బడ్జెట్ లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా సంచలన విజయం సాధించి వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదలైన రెండు వారాలకు విడుదలైన బ్రో సినిమా కంటే వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే విషయం మీద ట్విట్టర్లో త్రివిక్రమ్ డైలాగ్స్ పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి సంచలన ఆరోపణలు చేస్తే ట్వీట్ చేశారు.
Sharwanand: కొత్త పెళ్లి కొడుకు అప్పుడే ‘బేబీ ఆన్ బోర్డ్’ అంటున్నాడు.. ఏంటి కథ?
బేబీ సినిమా బ్రో కంటే ఎక్కువ అని ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ఈ ఖతర్నాక్ గాళ్ళు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో డబ్బులు కడుతున్నారు. మీరు వాళ్ళ ప్రమోషనల్ స్ట్రాటజీ గమనిస్తే బ్రో టీజర్ సూపర్ గా ఉందంటారు, టీ షర్ట్ లు వేసుకుంటారు ఆ తర్వాత బేబీ ట్రైలర్ అనౌన్స్ చేస్తారు. ఆరెంజ్ సినిమా స్పెషల్ షో వేసి వచ్చిన కలెక్షన్ల చెక్ ఇచ్చి అప్డేట్ రిలీజ్ చేస్తారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ అభిమానులను తమ సినిమాల కోసం వాడుకుంటున్నారు. వాళ్ల ప్రమోషన్స్ పాటర్న్ చూడండి అంటూ మరో ట్వీట్ చేసి అందులో సాయి రాజేష్ పెట్టిన రెండు ట్వీట్ ల స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. జూన్ 29 మధ్యాహ్నం రెండు గంటల 55 నిమిషాలకు బ్రో టీజర్ బాగుందని పోస్ట్ పెట్టి ఆ తరువాత బేబీ ట్రైలర్ డేట్ అనౌన్స్ చేశారు తరువాతి రోజు బేబీ పోస్ట్ ప్రొడక్షన్ , ప్రమోషన్స్ పక్కన పెట్టి మరీ తొలిప్రేమ కి వెళ్దాం అని కటింగ్ ఇచ్చారు. ఇలా మోసం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేయడంతో ఈ విషయం మీద సాయి రాజేష్ స్పందిస్తూ ఇక సోషల్ మీడియాలో తాను నోరు మూసుకుని ఉంటానని రాసుకొచ్చాడు.
🙏🏻🙏🏻🙏🏻
I will just shut my mouth from today on Social Media … https://t.co/kCDnvS2uYW— Sai Rajesh (@sairazesh) August 2, 2023