Anna Hazare: ‘‘డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడు’’.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు..

  • ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌పై అన్నాహజారే సంచలన వ్యాఖ్యలు..
  • అతను డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చాడని విమర్శలు..
Anna Hazare

Anna Hazare

Anna Hazare: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 05న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 08న ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. ఈ ఎన్నికల్లో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు నెలకొంది. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అనుకుంటే, ఈ సారైనా ఢిల్లీని గెలవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

Read Also: Bangladesh: బంగ్లాకు నిధులు ఆపేసిన ట్రంప్.. మహ్మద్ యూనస్‌తో ‘‘జార్జ్ సోరోస్’’ కుమారుడు భేటీ..

ఇదిలా ఉంటే, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన గురువు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అవినీతిపై స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకరం. ఆయన నాతో స్వచ్ఛంద సేవకుడిగా ఉన్నారు. జీవితంలో మీ ప్రవర్తన , అభిప్రాయాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నేను ఎప్పుడూ అతనికి చెప్పేవాడిని. మీ జీవితాన్ని మచ్చ లేకుండా ఉంచుకోండి మరియు త్యాగాలు చేయడం నేర్చుకోండి. ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవండి. కిరణ్ బేడి, ఇతరులు కూడా అప్పట్లో మాతో ఉన్నారు. కిరణ్ బేడి మీరు ‘అన్నా కీ పాఠశాల’ (పాఠశాల) ప్రారంభించాలని నాకు చెప్పేవారు… అయితే ఆయన (అరవింద్ కేజ్రీవాల్) డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభించాడు, ఆయన దిగజారిపోయాడు… ఏం చేయగలం’’ అని అన్నారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇటీవల ఆయన అధికారిక నివాసం ‘‘శీష్ మహల్’’ కోసం కోట్లలో ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.