కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న భార్యను బదిలీ చేసింది ప్రభుత్వం.. అయితే, ఆ బాధ్యతలను ఆమె భర్తే స్వీకరించడం హాట్ టాపిక్‌గా మారింది.. అందరినీ ఆశ్చ్యరానికి గురిచేస్తూ.. రాజకీయ దుమారం రేపుతోన్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టర్ రేణు రాజ్ తాజాగా బదిలీ అయ్యారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఆమె స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్‌ను కలెక్టర్‌గా నియమించింది సర్కార్.. రేణు, శ్రీరామ్.. ఇద్దరూ భార్యాభర్తలు కావడం…