ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి.. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. ఓ వింత పరిస్థితి ఇప్పుడు అధికార బీజేపీకి ఎదురైంది.. ఎందుకంటే.. ఒకేస్థానం కోసం ఓవైపు మంత్రి ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరోవైపు.. అదే స్థానం కోసం.. ఆమె భర్త కూడా తీవ్రంగా ప్రయత్నించడం ఇప్పుడు చర్చగా మారింది.. అదే సరోజనీనగర్ అసెంబ్లీ స్థానం.. ఈ స్థానంకోసం సీఎం యోగి ఆదిత్యనాద్ కేబినెట్‌లోని మంత్రి స్వాతి సింగ్, ఆమె భర్త పార్టీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ఇద్దరూ ఎవరి ప్రయత్నం వారు చేసుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది..
Read Also: డ్రగ్స్ కేసుల్లో ఎంతటివారున్నా వదిలేది లేదు-కేసీఆర్
అయితే, ఫిబ్రవరి 23న నాలుగో దశలో ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగబోతోంది.. దయాశంకర్ పార్టీ ఎన్నికల కమిటీలో సభ్యుడు కావడంతోపాటు ఇటీవల ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్‌ను పార్టీలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.. మరోవైపు.. స్వాతి సింగ్ మంత్రిగా ఉన్నారు.. 2016లో పార్టీలో చేరిన స్వాతి సింగ్ 2017లో సరోజనీ నగర్ నుంచి ఎన్నికయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ యోగి కేబినెట్‌లో మంత్రిగా చేరాలన్న పట్టుదలతో ఉన్నారు.. ఇక, ఆమె భర్త కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.. భార్యాభర్తలు ఇద్దరూ పోటీపోటీగా అనేతరహాలో సరోజనీనగర్‌లో హోర్డింగ్‌లతో హోరెత్తిస్తున్నారు.. అయితే, వీరు ఇద్దరూ కొట్టుకుంటే.. మూడోవాడికి లాభం అనే విధంగా.. మరో అభ్యర్థి వేటలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది.