Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో భారీగా డ్రగ్స్, బంగారం, గంజాయి పట్టివేత

Delhiairport

Delhiairport

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరిశ్రమపై అధికారుల బృందం దాడులు చేశాయి. రూ.108 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పరిశ్రమలో 7.9 కేజీల కొకైన్, 1.8 కేజీల హెరాయిన్, 16.27 కేజీల Amphetamineతో పాటు 115 కేజీల ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో మరో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో నిందితుడు

ఇక ఢిల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. విదేశీ గంజాయికి అడ్డాగా దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మారింది. రూ.48 కోట్ల విలువ చేసే 48 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 4 రోజుల ఆపరేషన్‌లో కస్టమ్స్ బృందం 15 మంది స్మగ్లర్స్ ఆట కట్టించారు. బ్యాంకాక్ నుంచి దర్జాగా విదేశీ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా కేటుగాళ్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. గంజాయిని ప్లాస్టిక్ కవర్స్‌లో ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించే యత్నం చేస్తున్నారు. విదేశీ గంజాయికి మెయిన్ హబ్‌గా బ్యాంకాక్ మారింది. కేజీలకు కేజీల విదేశీ గంజాయి ఇండియాకు సరఫరా అవుతోంది. చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మటు వేసి పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడి కదలికలపై నిఘా పెట్టారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్‌ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే.. యూఎన్‌లో భారత్ స్పష్టీకరణ
అలాగే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ బంగారం కూడా పట్టుబడింది. కోటి రూపాయల విలువ చేసే 1 కేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బర్మా నుంచి ఢిల్లీ చేరుకున్న ఓ‌ లేడి కిలాడి దగ్గర బంగారం గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా బంగారు బిస్కెట్స్‌ను లోదుస్తులలో దాచి తరలించే యత్నం చేసింది. స్ర్కీనింగ్‌లో బంగారు గుట్టు రట్టు అయింది. దీంతో‌ లేడి కిలాడీని అధికారులు అరెస్ట్ చేశారు. ‌కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version