American Independence: అమెరికా స్వాతంత్య్రానికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సహాయం.. ఎలాగంటే..
- అమెరికా స్వాతంత్య్రంలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పరోక్ష పాత్ర..
- ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
American Independence: అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్యాన్ని పొంది 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. బ్రిటన్‌పై జరిగిన స్వాతంత్ర్య యుద్ధాల తర్వాత విముక్తి అయింది. అయితే, అమెరికా స్వేచ్ఛను పొందడానికి ఒక రకంగా మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు ఒక కారణం అని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఇప్పటికీ అమెరికా వీరిద్దరి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంటుంది. వీరు అమెరికా తరుఫున నేరుగా యుద్ధం చేయకున్నా, భారత్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం చాలా ప్రభావం చూపించిందని చరిత్రకారులు భావిస్తుంటారు.
1775లో అమెరికా స్వాతంత్ర్య యుద్ధాలు జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో ప్రారంభయమ్యాయి. ఇదే సమయంలో హైదర్ అలీ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం(1780-84) సాగింది. దీంతో బ్రిటన్ ఒకేసారి అటు అమెరికాలో, ఇటు మైసూర్లో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో బ్రిటిష్ సైన్యం, నేవీ అమెరికాపై పూర్థిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయింది. 1780లో పోలిలూర్ యుద్ధంలో హైదర్ అలీ సేనలు బ్రిటిష్ సైన్యాన్ని దారుణంగా ఓడించాయి. మైసూర్ పాలకుల విజయంతో ఆంగ్లేయులపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో ఫ్రాన్స్ అమెరికా విప్లవకారులకు, మైసూరుకు మద్దతు ఇవ్వడంతో బ్రిటిష్ పరిస్థితి క్లిష్టంగా మారింది.
Also Read
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
ఆ సమయంలో హైదర్ అలీపై అమెరికాలో చాలా గౌరవం ఉండేది. ఆయన పేరుతో ‘‘హైదర్ అలీ’’ అనే యుద్ధ నౌకను కూడా నిర్మించారు. ఈ నౌక బ్రిటిష్ యుద్ధ నౌకలపై విజయం సాధించడంతో అమెరికాలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో అమెరికన్ కవులు హైదర్ అలీని ప్రశంసిస్తూ కవితలు రాశారు. ఆయన గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
1782లో హైదర్ అలీ మరణంతో రాజ్య బాధ్యతల్ని టిప్పు సుల్తాన్ స్వీకరించారు. ట్రిప్పు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. కొంత కాలం అమెరికన్ పుస్తకాల్లో టిప్పు ప్రస్తావన కూడా ఉండేది. 1799లో శ్రీరంగ పట్నం యుద్ధంలో టిప్పు మరణించినప్పుడు, అమెరికాలోని మేధావులు ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. నిజానికి, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ యుద్ధాలు అమెరికాకు స్వాతంత్య్రాన్ని సాధించపెట్టలేదు కానీ, ఓ రకంగా బ్రిటిష్ వారు తమ శక్తిని పూర్తిగా మైసూర్ యుద్ధంలో కేంద్రీకృతం చేయడంతో అమెరికా స్వాతంత్య్రం సులువైంది. పరోక్షంగా వీరిద్దరు సహకరించినట్లైంది.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!