Tollywood Heros: రిస్కీ ప్రాజెక్టులతో టెన్షన్లో టాలీవుడ్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Heros: స్టార్ హీరో అంటే సేఫ్ కమర్షియల్ సినిమా చేయడమే ఈజీ. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్లతో, పీరియాడిక్ కథలతో పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న అత్యంత రిస్కీ ప్రాజెక్ట్ లో ‘ఫౌజీ’ ఒకటి. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు హను రాఘవపూడి. ‘సీతారామం’తో క్లాస్ హిట్ ఇచ్చిన, పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం ఆయనకి ఇదే ఫస్ట్ టైం. మరోవైపు 1940స్ బ్రిటిష్ ఇండియా, ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్, యుద్ధం నేపథ్యం—ఇవన్నీ నేటి మాస్ ఆడియన్స్ ను ఎంతవరకు కనెక్ట్ చేస్తాయి అనేది చూడాలి. అంతేకాదు, ‘ది రాజా సాబ్’ బ్రేక్ ఈవెన్ కూడా దాటలేకపోయిన తర్వాత, మరో డైరెక్టర్ తో ప్రభాస్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై సహజంగానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా ప్రస్తుతం ‘స్పిరిట్’ హైప్ ముందు, ఈ ఇయర్ ఎండ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ‘ఫౌజీ’ ప్రమోషన్స్ పెద్దగా కనిపించడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’తో పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వీఎఫ్ఎక్స్ రీవర్క్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది. దాంతో బడ్జెట్ కూడా భారీగా పెరిగిందనే టాక్ ఉంది. మరోవైపు చిరంజీవి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మన శంకర్ వరప్రసాద్’ గారు కూడా సుమారు 350 నుంచి 400 కోట్ల రేంజ్ లోనే ఆగింది. ఇప్పుడు అంతకంటే భారీ బడ్జెట్ తో వస్తున్న సోషియో ఫ్యాంటసీ ‘విశ్వంభర’, పాన్ ఇండియా స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనేదే అసలు ప్రశ్న.
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
విజయ్ దేవరకొండ కెరీర్ లో ‘రణబలి’ రిస్కీ ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. ‘లైగర్’ తర్వాత సరైన పాన్ ఇండియా హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్, ఇప్పుడు పూర్తిగా కొత్త జోన్ లో అడుగుపెడుతున్నాడు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామా విజయ్ ఇప్పటివరకు చేయని జానర్. పైగా ఆయనకు బాగా సెట్ అయిన తెలంగాణ స్లాంగ్ కు భిన్నంగా రాయలసీమ నేపథ్యం ఉండడం కూడా మరొక ఛాలెంజ్. భారీ బడ్జెట్, పీరియాడిక్ సెటప్, కొత్త బాడీ లాంగ్వేజ్—ఇవన్నీ కలిసి ఈ సినిమాను విజయ్ కెరీర్ లో అత్యంత రిస్కీ ప్రాజెక్ట్ గా మారుస్తున్నాయి.
యంగ్ హీరో నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ రిస్క్ గా ‘స్వయంభూ’ మారుతోంది. ‘కార్తికేయ 2’ తో 100 కోట్ల మార్కు దాటిన తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవడంతో, ఇప్పుడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా పై నిఖిల్ పందెం కాస్తున్నాడు. నిఖిల్ మార్కెట్ తో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ చాలా పెద్దది కావడం, చారిత్రిక నేపథ్యం, ఫ్రాంచైజీ ప్లానింగ్—ఇవన్నీ కలిసి ‘స్వయంభూ’ను ఆయన కెరీర్ లో ‘డూ ఆర్ డై’ ప్రాజెక్ట్ గా మార్చాయి. కంటెంట్ క్లిక్ అయితే నిఖిల్ మరొక స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేకపోతే భారీ బడ్జెట్ ఒత్తిడి ఈ ప్రాజెక్ట్ పై పడే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!