Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్!
- ప్రధాన నిందితురాలి బెయిల్ మంజూర్
- నిర్ఘాంతపోయిన యావత్తు దేశం
- హైకోర్టులో సవాల్ చేయనున్న బాధిత కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసు.. యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కేసు. కట్టుకున్నవాడిని పారాణి ఆరకముందే అత్యంత దారుణంగా భార్య చంపేసింది. అంతటి దారుణమైన సంఘటన. మహిళా సమాజమే నివ్వెరపోయింది. అలాంటిది నిందితురాలికి బెయిల్ రావడం మరింత షాక్‌కు గురి చేస్తోంది. అసలేం జరిగింది?. నిందితురాలి బెయిల్ ఎలా వచ్చింది?. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
రాజా రఘువంశీ మధ్యప్రదేశ్‌కు ఇండోర్ వాసి. మంచి బిజినెస్‌మేన్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనమ్ రఘువంశీతో 2025, మే 11న అత్యంత గ్రాండ్‌గా వివాహం జరిగింది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23న దంపతులు అదృశ్యమైనట్లు వార్త కలకలం రేపింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి షిల్లాంగ్ కొండలను జల్లెడ పట్టారు. జూన్ 2న కొండల్లో రాజా రఘువంశీ మృతదేహం లభించింది. గాయాలను బట్టి హత్యగా కేసు నమోదు చేశారు. ఇక భార్య సోనమ్ రఘువంశీ ఏమైందని దర్యాప్తు చేస్తుండగా అకస్మాత్తుగా జూన్ 8న యూపీలోని పోలీసుల ముందు ప్రత్యక్షమైంది. విచారించగా ప్రియుడు, హంతక ముఠాతో కలిసి చంపేసినట్లుగా పేర్కొంది. దీంతో యావత్తు దేశం కలవరపాటుకు గురైంది. అనంతరం నిందితులను జైలుకు పంపించారు.
Also Read
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
తాజాగా ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూర్ అయింది. సాక్ష్యాధారాలకు, సాక్షులకు దూరంగా ఉండాలని.. అలాగే షిల్లాంగ్ విడిచి వెళ్లొద్దని కోర్టు హెచ్చరించింది. ఇంత దారుణమైన కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక బాధిత కుటుంబమైతే ఆశ్చర్యపోతుంది.
నిందితురాలికి బెయిల్ రావడంతో షిల్లాంగ్ పోలీసులు డొల్లతనం బయటపడింది. దర్యాప్తు లోపంగా తేలింది. దాదాపు నిందితులపై 790 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు. కానీ ఛార్జిషీట్ అంతా డొల్లతనం అని తేలిపోయింది. ఎక్కడా కూడా నిందితులపై మర్డర్ సెక్షన్ల నమోదు చేయకపోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఐపీసీ సెక్షన్ 103 (1) కాకుండా ఐపీసీ సెక్షన్ 403 (1) నమోదు చేశారు. హత్య కేసుగా కాకుండా ఆస్తిని అక్రమంగా దుర్వినియోగం చేశారంటూ అభియోగం మోపారు. అటు యూపీ పోలీసులు గానీ.. ఇటు మేఘాలయ పోలీసులు గానీ తీవ్రమైన హత్యా అభియోగాలు మోపడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో నిందితురాలికి భారీగా ప్రయోజనం చేకూరింది. సోనమ్‌ను అసలెందుకు అరెస్ట్ చేశారో కూడా న్యాయస్థానానికి స్పష్టమైన ఆధారాలు సమర్పించడంలో ఖాకీలు విఫలమయ్యారు. దీంతో అరెస్ట్ అనేది ప్రాథమిక హక్కులకు సంబంధించిందని.. ఆర్టికల్ 22 (1)ను నేరుగా ఉల్లంఘించడమేనని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో సోనమ్ రఘువంశీకి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు సోనమ్‌కు బెయిల్ రావడంతో ఇతర నిందితులకు కూడా ఈజీగా బెయిల్ రావొచ్చు. అంతేకాకుండా ఈ కేసు నుంచి సులువుగా కూడా బయటపడొచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.
షరతులు..
సోనమ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కొన్ని షరతులు విధించింది. సాక్ష్యాలు లేదా సాక్షులకు దూరంగా ఉండాలని.. వాటిని తారుమారు చేయవద్దని హెచ్చరించింది. ప్రతి విచారణకు కోర్టుకు హాజరు కావాలని.. అనుమతి లేకుండా షిల్లాంగ్ జిల్లాను విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. బెయిల్‌కు రూ. 50,000 పూచీకత్తు కూడా అవసరం కాగా.. సోనమ్ తండ్రి దేవి సింగ్ ఇండోర్ నుంచి షిల్లాంగ్‌కు ప్రయాణించి పూచీకత్తును సమర్పించారు. షిల్లాంగ్ జైలు బయట దేవి సింగ్‌తో మాట్లాడటానికి మీడియా ప్రయత్నించగా మౌనంగా ఉన్నారు. ఇక బాధిత రాజా రఘువంశీ కుటుంబం తీవ్రంగా మండిపడుతోంది. బెయిల్ ఇవ్వడాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని పేర్కొంది.

తాజావార్తలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?