Hindi Row: ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించే ప్రశ్నే లేదు, కానీ.. హిందీ వివాదంపై కేంద్రమంత్రి..
- కేంద్రం, తమిళనాడు మధ్య ‘‘హిందీ వివాదం’’..
- సీఎం స్టాలిన్‌కి కేంద్రమంత్రి లేఖ..
- ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించం, కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindi Row: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులోని ఎంకే స్టాలిన్ సర్కార్, అధికార డీఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్రం విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం సీఎం స్టాలిన్‌కి లేఖ రాశారు. ‘‘ ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు, కానీ విదేశీ భాషాలపై అతిగా ఆధారపడటం, విద్యార్థులు భాష మూలాలకు గురికావడాన్ని పరిమితం చేయడం జరుగుతుంది’’ అని కేంద్రమంత్రి లేఖలో స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం (NEP) భాష స్వేచ్ఛ సూత్రాన్ని సమర్థిస్తుందని, విద్యార్థులు తమకు నచ్చిన భాషలో నేర్చుకోవడాన్ని కొనసాగించేలా చేస్తుందని అన్నారు. మన భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటం, బలోపేతం చేయాలని చూస్తున్నామని ఆయన చెప్పారు.
Read Also: Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్‌పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
భాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద రూ.2,152 కోట్లు వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఒక రోజు తర్వాత విద్యా మంత్రి స్పందన వచ్చింది. ‘‘త్రిభాషా విధానం 1968 నుండి భారతదేశ విద్యా వ్యవస్థలో ఉంది. దురదృష్టవశాత్తు విద్యా విధానంలో భాగమైనప్పటికీ, దానిని ఎప్పుడూ అమలు చేయలేదు. దీని ఫలితంగా పాఠశాలల్లో భారతీయ భాషల క్రమబద్ధమైన బోధన క్షీణించింది’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన పేర్కొన్నారు. మే 2022లో చెన్నైలో ప్రధాని మోడీ నరేంద్ర మోడీ చేసిన ‘‘తమిళ భాష శాశ్వతమైంది’’ అనే వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.
కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య ‘‘హిందీ వివాదం’’ కొనసాగుతోంది. హిందీని బలవంతంగా విధించేందుకు తమను కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తోందని ఆదివారం స్టాలిన్ ఆరోపించారు. తమ రాష్ట్రం అమలు చేస్తున్న ‘‘రెండు భాషల’’ విధానాన్ని వదులుకోమని చెప్పారు. ఈ వివాదంపై సీఎం కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ..‘‘ ఇది ద్రవిడ భూమి, పెరియార్ భూమి. తమిళ ప్రజల హక్కుల్ని హరించడానికి ప్రయత్నించినప్పుడు, ‘‘గో బ్యాక్ మోడీ’’ని ప్రారంభించారు. మీరు మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి ‘‘గెట్ అవుట్ మోడీ’’ అనే స్వరం వినిపిస్తోంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!