Heavy Rains In India: ఇండియా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు వానలకు తడిసి ముద్దవుతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిని భారీ వర్షాలు కురవనున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంపై అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కోనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో వాయువ్యదిశగా కదిలతే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది.
మధ్య భారతదేశంలో పాటు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఉపరితల ద్రోణి ప్రభావం ఉండే అవకాశం ఉంది. దక్షిణ మహారాష్ట్ర, గోవా తీరాల నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మధ్య తుఫాన్ వాతావరణం నెలకొని ఉంది. మధ్యప్రదేశ్ మీదుగా అల్పపీడన ప్రాంతంతో పాటు బంగ్లాదేశ్ మధ్య వరక ఉపరితల ద్రోణి ఉంది. వీటి వల్ల రానున్న రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Also: CM Help: అర్థరాత్రి కారు ప్రమాదం.. కాన్వాయ్ ఆపి భరోసా ఇచ్చిన సీఎం..
మంగళవారం ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీహార్, జార్ఖండ్, సౌరాష్ట్ర, కచ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 వరకు తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 17 వరకు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 15 నుంచి 17 వరకు వర్షాలు కురవనున్నాయి. దీంతో పాటు తమిళనాడులోని ఘాట్ ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవనున్నాయి. కర్ణాటకలో కూడా వానలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది.