Delhi Rain: ఢిల్లీలో వర్ష బీభత్సం.. నలుగురు మృతి
- ఢిల్లీలో వర్ష బీభత్సం
- నలుగురు మృతి
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- విమాన రాకపోకలకు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున సృష్టించిన దుమ్ము తుఫాన్, భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు నేలకొరిగాయి. నజాఫ్‌గఢ్‌లో భారీ చెట్టు కూలడంతో నలుగురు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. 26 ఏళ్ల జ్యోతి అనే వివాహితతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. భర్త అజయ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: భారత్‌లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ఇక విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి కూడా నీళ్లు వచ్చేశాయి. దాదాపు 100కి పైగా విమానాలు ఆలస్యం కానున్నట్లు విమాన సంస్థలు హెచ్చరించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనెక్టివిటీ విమాన ప్రయాణికులు మాత్రం మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన రెండు విమానాలను జైపూర్‌కు, ఒక విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించినట్లు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Akkineni : శోభితా అక్కినేని.. చీర కట్టులో ఎంత చక్కగా.. ముద్దుగా ఉందో..
ఇక ఢిల్లీలోని ద్వారక, ఖాన్‌పూర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్‌పత్ నగర్ మరియు మోతీ బాగ్ వంటి ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. కొన్ని కొమ్మలు రహదారులపై పడిపోయాయి. అయితే అధికారులు నష్టాన్ని అంచనా వేయలేదు. వీలైనంత వరకు ప్రజల్లో ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
ఇక భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం వరకు తీవ్రమైన ఉరుములు, ఈదురుగాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అసవరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు.
VIDEO | Several trees were uprooted in parts of Delhi as heavy rainfall lashed the national capital. Visuals from Delhi Secretariat area.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)#delhirain #DelhiWeather pic.twitter.com/eDL3YSJSda
— Press Trust of India (@PTI_News) May 2, 2025
Alert Severe Weather over Delhi NCR going on be safe @airnewsalerts @ndmaindia @moesgoi @DDNewslive pic.twitter.com/Z60OT0OArI
— India Meteorological Department (@Indiametdept) May 2, 2025
VIDEO | Delhi CM Rekha Gupta (@gupta_rekha) assesses situation at Majnu Ka Tilla as heavy rainfall lashes the national capital.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)#DelhiWeather #delhirain pic.twitter.com/UDITNddcxK
— Press Trust of India (@PTI_News) May 2, 2025
#WATCH | Waterlogging witnessed in several parts of Delhi as heavy rain lashes the national capital
(Visuals from near Delhi airport) pic.twitter.com/b6gd6fmw8b
— ANI (@ANI) May 2, 2025
VIDEO | Delhi minister Parvesh Verma (@p_sahibsingh) assesses waterlogging situation at Minto Bridge as heavy rainfall lashes the national capital.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)
(Source: Third Party)#Delhi #delhirain pic.twitter.com/ruJ9yE2xLq
— Press Trust of India (@PTI_News) May 2, 2025
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!