Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Arnab Update: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను అర్నబ్ తుఫాన్ వణికిస్తోంది. తీరం దాటే ప్రక్రియ గత రెండు గంటలుగా నెమ్మదిగా కొనసాగుతోందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత తుఫాన్ వేగం బాగా తగ్గిందని, ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నెమ్మదిగా కదులుతోందని వెల్లడించారు. ప్రస్తుతం నరసాపురానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, మధ్యాహ్నానికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అర్నబ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోనసీమ, గోదావరి జిల్లాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
Also Read
- లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
- Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
- Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
- 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటలుగా పలాస, పాతపట్నం, కొత్తూరు, రణస్థలం ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలగా, విద్యుత్ స్తంభాలు సైతం పడిపోయాయి. దీంతో స్థానికంగా విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, విజయవాడ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మచిలీపట్నంలో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.
మరోవైపు తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు ఇప్పటికే సెలవు ప్రకటించారు. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. విశాఖపట్నంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. హరిజన జగ్గయ్యపాలెం, షీలానగర్ సమీపంలో రహదారులపై నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ తీరం దాటే ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బలమైన గాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని.. తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
-
Honda CB350C: హోండా CB350C స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ఆల్-బ్లాక్ లుక్, 348.36cc ఇంజిన్‌తో కొత్త బైక్!
-
Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!