Site icon NTV Telugu

Bengaluru: బెంగళూర్ లో భారీ వర్షం.. నీటిలో మునిగిన రోడ్లు, కార్లు.

Bengaluru

Bengaluru

Heavy Rain in Bengaluru, Many Roads Flooded, Cars Damaged: బెంగళూర్ నగరం వరసగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గత నెల కురిసిన వర్షాల కారణంగా చాలా ఏరియాలు నీటిలో మునిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బుధవారం బెంగళూర్ నగరంలో భారీ వర్షం కురిసింది. బెల్లందూర్ బెల్లందూరు ఐటీ జోన్‌తో సహా నగరంలోని తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. రాజమహల్ గుట్టహళ్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Read Also: United Nations: భారత్ ప్రతిపాదనను నిలిపేసిన చైనా.. పాకిస్తాన్ ఉగ్రవాదికి మద్దతు

లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి భారీగా వరద నీరు చేసింది. పలు రెసిడెన్షియల్ భవనాల్లోకి నీరు చేసింది. సెల్లార్ లోనే ఉన్న కార్లు అన్నీ నీటమునిగాయి. సాయంత్రం సమయంలో భారీ వర్షం కురవడవంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా చాలా మంది ప్రజలు మెట్రో స్టేషన్లలో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది.

గత నెలలో కురిసిన భారీ వర్షాలు బెంగళూర్ నగరాన్ని వణికించాయి. ఈ వర్షాలు రాజకీయంగా కర్ణాటకలో చిచ్చు పెట్టాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య విమర్శలు చెలరేగాయి. గ్లోబల్ ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతాలతో పాటు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మూడు రోజుల పాటు కురిసిన వర్షాలతో నగర జనజీవితం అస్తవ్యస్తం అయింది. ఆ సమయంలో అనేక కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. నీటిలో మునిగిన ఖరీదైన కార్లు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. రుతుపవన కాలం ప్రారంభం అయినప్పటి నుంచి బెంగళూర్ లో భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 1706 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. 2017లో 1696 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

Exit mobile version