జార్కండ్ లాతేహర్ జిల్లా లో మావోయిస్టుల డంప్ లభ్యం అయింది. జాగార్ లోహార్ గాడా అటవీ ప్రాంతంలో సిఆర్ పిఎఫ్ ,జార్కండ్ పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. పోలీసులకు లభించిన డంప్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇన్సాస్ రైఫిల్ 1590 కాట్రిడ్జ్ లు, 19 మ్యాగజైన్ లు 187 డిటోనేటర్లు , ఒక హ్యాండ్ గ్రైనేడ్ ,13 ఐఈడిలు భ్యాటరీలు , వైర్లు స్వీధీనం చేసుకున్నాయి భద్రతాదళాలు.
మావోయిస్టు పార్టీ రీజనల్ కమాండర్ రవీందర్ గంజు, చోటు సింగ్ ఖైరవార్, బలరామ్ ఒరాన్, మునేశ్వర్ గంజు కోసం గాలింపు కొనసాగుతోందని తెలుస్తోంది. లోహార్ డాగా జిల్లా అటవీ ప్రాంతం బుల్ బుల్ గ్రామ సమీపంలో జరుగుతున్న అభివృద్ది పనులపై దాడికి మావోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దాడిలో 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉన్నట్లుగా వచ్చిన పక్కా సమాచారంతో అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ జరుగుతోంది. ఐఈడి పేల్చి అడవిలోకి పారిపోయారు మావోయిస్టులు. అక్కడ ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది.