K Padmarajan: “గెలుపెరగని యోధుడు”.. 238 సార్లు ఓడినా మళ్లీ ఎన్నికలకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Padmarajan: తమిళనాడుకు చెందిన కే పద్మరాజన్ ఏకంగా 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారు. ‘‘గెలుపెరగని యోధుడి’’గా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్రపతి, ఎంపీ, ఎమ్మెల్యే మొదలుకొని స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఓడిపోయి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా రికార్డ్ క్రియేట్ చేశారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 65 ఏళ్ల పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులోని ధర్మపురి జిల్లా నుంచి పోటీకి సిద్ధమయ్యారు.
Read Also: Bandi Sanjay: చెంగిచర్ల ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా?
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ప్రధాని నరేంద్రమోడీతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, రాహుల్ గాంధీ వంటి రాజకీయ దిగ్గజాలపై పోటీ చేసిన చరిత్ర పద్మరాజన్‌కి ఉంది. ‘‘ఎలక్షన్ కింగ్’’గా పేర్కొన్న ఆయన గెలుపొందడం తన ఉద్దేశం కాదని, ఎన్నికల్లో పోటీ చేయడమే తన విజయమని, మళ్లీ ఓడిపోయినా సంతోషమే అని చెబుతున్నారు. టైర్ రిపేర్ షాప్ నిర్వహించే పద్మరాజన్ హోమియోపతి మందుల అమ్మకంతో పాటు స్థానికంగా ఓ మీడియాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్, ప్రతీసారి డిపాజిట్ కోల్పోయి లక్షల రూపాయల్ని కోల్పోయారు. 2011లో మెట్టూర్ అసెంబ్లీకి పోటీ చేసిన ఆయనకు ఒక్క ఆయన ఓటు తప్పితే, వేరే వారు ఓటేయలేదు. ఈ ఎన్నికల పరంపరలో అత్యధికంగా 6273 ఓట్లు సాధించారు. ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. అత్యధిక సార్లు ఓడిపోయిన అభ్యర్థిగా తన పేరు లిఖించుకున్నారు. నిజంగా తాను ఒకవేళ గెలిస్తే గుండెపోటు వస్తుందేమో అని చమత్కరిస్తున్నారు ఆయన.
తాజావార్తలు
-
Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్‌బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్‌లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!