Rajanikanth : యోగానంద ఆశ్రమంలో ధ్యానం చేసిన తలైవా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే అద్భుతమైన టాక్ తో అదరగోడుతుంది. జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.గత కొంత కాలంగా వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో అదరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు..సాధారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమా విడుదలకు కు ముందు మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్తారు.. గత రెండు మూడేళ్ళుగా కరోనా కారణంగా ఆయన హిమాలయాలకు వెళ్లలేదు. దీనితో ఆయన జైలర్ సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు.ఈ హిమాలయాల దర్శనం ఆయన ఎన్నో సంవత్సరాలుగా సెంటిమెంట్ గా పాటిస్తున్నారు. తాజాగా ఆయన హిమాలయాల దర్శనం తరువాత వరుసగా ఆశ్రమాలు మరియు దేవాలయాలు సందర్శిస్తూ వస్తున్నారు.
హిమాలయాల్లో ఆశ్రమాలను దర్శించి ఆశీర్వచనం తీసుకున్న సూపర్ స్టార్.. ఆతరువాత బద్రినాథ్ క్షేత్రంలో ఆ బద్రీనాధుని దర్శించుకున్నారు. బద్రీనాథ్ క్షేత్రంలో రజనీని చూసిన ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. తన ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించి వారితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ తరువాత సూపర్ స్టార్ జార్ఖండ్ సిటీలో ఉన్న యోగానంద ఆశ్రమాన్ని సందర్శించారు.అక్కడ ఓ గంటసేపు ఆయన ధ్యానం చేశారు. ఆ సిటీ సమీపంలో ఉన్న చిన్నమస్త ఆలయాన్ని కూడా రజినీ దర్శించుకున్నారు.ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న స్వామీజీలతో ముచ్చటించారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా యోగానంద ఆశ్రమానికి వచ్చినట్లు రజనీకాంత్ స్వయంగా వారికీ వెల్లడించారు. రాంచీ సమీపంలో ఉన్న భైరవి, దామోదర్ నదీ సంగమం వద్ద ఉన్న ఆలయాన్ని కూడా ఆయన దర్శించి ప్రత్యేక హారతి, పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!