New CEC Gyanesh Kumar: కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్.. ఆమోదించిన రాష్ట్రపతి
- కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా జ్ఞానేశ్ కుమార్ నియామకం..
- ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ వివేక్ జోషి నియామకం..
- గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New CEC Gyanesh Kumar: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్.. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఎంపికయ్యారు. అతడి స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా.. ప్రస్తుతం హర్యానా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ జోషి (1989 బ్యాచ్ ఐఏఎస్)ని నియమించారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం ఈరోజు (ఫిబ్రవరి 18) ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఈసీని ఎంపిక చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సోమవారం నాడు సమావేశం అయింది. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా మోడీ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసి తమ నిర్ణయాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా ఆమె ఆమోదం తెలిపింది.
Read Also: AlluArjun: అల్లు అర్జున్, అట్లీ మూవీలో హీరోయిన్ ఫిక్స్..?
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
అయితే, కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్.. గత ఏడాది మార్చిలో ఈసీగా బాధ్యతలు చేపట్టారు. 2019లో కేంద్ర ప్రభుత్వం అధికరణం 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లును రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంశాఖలో అప్పుడు సంయుక్త కార్యదర్శి (కశ్మీర్ డివిజన్)గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత సహకార శాఖ కార్యదర్శిగా 2024 జనవరిలో పదవీ విరమణ చేయగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. ఎన్నికల కమిషనర్‌గా ఎంపికయ్యారు. సీఈసీగా జ్ఞానేశ్ 2029 జనవరి 26వ తేదీ వరకు పదవీలో కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బీహార్, వచ్చే ఏడాదిలో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
తాజావార్తలు
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!