Gulam Nabi Azad: పది రోజుల్లో పార్టీ ప్రకటన.. అది ఎవరి వల్లా కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gulam Nabi Azad Interesting Comments On Article 370: ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. మరో పది రోజుల్లోనే తన కొత్త పార్టీని ప్రకటిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో.. ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే తనపై వచ్చిన విమర్శల మీద స్పందస్తూ.. ‘‘నా మీద కాంగ్రెస్ నేతలు మిసైళ్లు విసిరారు. నేను కేవలం 303 రైఫిల్ మాత్రమే ఉపయోగించా. ఆ దెబ్బకు వాళ్ల మిసైల్సన్నీ ధ్వంసమయ్యాయి. ఒకవేళ నేను బాలిస్టిక్ మిసైల్ వినియోగించి ఉంటే, వారి పరిస్థితేంటి? బహుశా ఎవరూ ఈపాటికి కనిపించకపోయేవారు’’ అని కౌంటర్లు వేశారు.
ఇదే సమయంలో.. రెండేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370పై గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ద్వారా జమ్ముకశ్మీర్‌కు లభించిన ప్రత్యేక ప్రతిపత్తిని మళ్లీ సాధించుకోవడం అసాధ్యమని అన్నారు. స్థానిక రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని మభ్యపెడుతున్నాయని, కానీ తాను మాత్రం అందరిలా మభ్యపెట్టలేనని అన్నారు. ఓట్ల కోసం కశ్మీర్ ప్రజల్ని తాను మోసం చేయలేనని, కేవలం వాస్తవాలు మాత్రమే చెప్తానన్నారు. ఆర్టికల్ 370ని తీసుకురావడమన్నది సాధ్యం కాని విషయమని తేల్చి చెప్పారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలంటే.. పార్లమెంటులో టూ థర్డ్ మెజార్టీని సాధించాల్సి ఉంటుందని, అయితే అధి అసాధ్యమని వెల్లడించారు. బీజేపీని కాదని, ఆర్టికల్ 370కి అనుకూలంగా మెజార్టీని సాధించే పార్టీ దేశంలో ఏదీ లేదని గులాం నబీ ఆజాద్ ఉధ్ఘాటించారు.
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
జమ్ముకశ్మీర్‌ను మొఘలులు 800 ఏళ్లు పాలించారని, బ్రిటిష్ వారు 300 ఏళ్లు పాలించారని.. అయితే ఇప్పటికీ జమ్ముకశ్మీర్‌లో వేలాది మంది పాలకులు, ఆక్రమణదారులు ఉన్నారంటూ స్థానిక రాజకీయ పార్టీలను గులాంనబీ ఆజాద్ టార్గెట్ చేశారు. అందరూ జమ్ము కశ్మీర్‌ను దోచుకున్నారన్నారు. తాను పెట్టబోయే రాజకీయ పార్టీకి ఇంకా పేరు నిర్ణయించలేదని.. ప్రజలే తన పార్టీ పేరుతో పాటు జెండా నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తన పార్టీ పేరును ప్రకటిస్తానన్నారు. జమ్ముకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంతో పాటు స్థానిక ప్రజల ఉద్యోగ, భూమి హక్కులను కాపాడాలన్న ఎజెండా విషయంలో తమ పార్టీ స్పష్టంగా ఉందని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!