Gujarat: ఎమ్మెల్యే అల్లుడి రాష్ డ్రైవింగ్.. ఆరుగురి దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA son-in-law rash driving.. Six people died: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కియా సెల్టోస్ కారు ఆటోను, బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటన ఆనంద్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కుమార్తెలు ఉన్నారు. రక్షా బంధన్ జరుపుకుని వస్తుండగా..కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది.
Also Read
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
ప్రమాదం జరిగిన సమయంలోనే ఆటో డ్రైవర్, బైక్ నడుపుతున్న వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. మృతులంగా సోజిత్ర, బొరియావీ గ్రామాల ప్రజలుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణమైన కారు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూనంభాయ్ పర్మార్ బంధువు కేతన్ పాధియార్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. కేతన్ స్వయానా ఎమ్మెల్యేకు అల్లుడు. కేతన్ అతివేగంగా, అజాగ్రత్తగా కారును నడిపి ఆరుగురి మరణాలకు కారణం అయ్యాడు. ప్రస్తుతం కేతన్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 304 కేసును పెట్టారు. మృతులను సోజిత్రాలోని నవగఢ్ గ్రామానికి చెందిన జియాబెన్ మిస్త్రీ, జాన్వీబెన్ మిస్త్రీ, వినబెన్ మిస్త్రీ, ఆటోరిక్షా డ్రైవర్ యాసన్ వోహ్రా, ఆనంద్‌లోని యోగేష్ ఓడ్, సందీప్ ఓడ్గా గుర్తించారు. ఘటన సమయంలో కేతన్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాదంపై బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిజమైన ముఖం అంటూ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
-
Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
-
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!