Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Gujarat Election 2022 Second Phase Polling Begins

Gujarat Election: గుజరాత్‌లో చివరి దశ పోలింగ్‌.. త్రిముఖ పోరులో ఉత్కంఠ

Published Date :December 5, 2022 , 8:45 am
By Sudhakar Ravula
Gujarat Election: గుజరాత్‌లో చివరి దశ పోలింగ్‌.. త్రిముఖ పోరులో ఉత్కంఠ
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశవ్యాప్తంగా ఉత్కంఠరేపుతోన్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో తుది విడత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ప్రారంభమైంది.. ఆయా స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది.. మూడు దశాబ్దాలుగా గుజరాత్‌ను ఏలుతోన్న బీజేపీ.. ఈ సారి అత్యధికంగా ఓట్లు, సీట్లు గెలిచి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంటే.. తొలిసారే సత్తాచాలాని ఆప్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. తుది దశ పోలింగ్‌ జరుగుతోన్న నార్త్‌ గుజరాత్‌లో గతంలో కాంగ్రెస్‌ కంటే తక్కువ సీట్లు సాధించిన బీజేపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also: Astrology : డిసెంబర్‌ 05, సోమవారం దినఫలాలు

గుజరాత్‌లో మొత్తం మొత్తం 182 సీట్లు ఉంటే డిసెంబర్‌ 1వ తేదీన తొలి విడతలో 89 సీట్లకు పోలింగ్‌ జరిగింది.. 63.31 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇవాళ రెండో దశలో మిగిలిన స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది.. ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీతో కలిపి 61 పార్టీల నుంచి మొత్తంగా 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.. బీజేపీ, ఆప్‌ 93 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టగా.. కాంగ్రెస్‌ 90 చోట్ల పోటీ చేస్తూ.. తన మిత్రమక్షమైన ఎన్సీపీ అభ్యర్థులను రెండుచోట్ల నుంచి బరిలోకి దించింది.. ఇక, భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) 12 చోట్ల, బీఎస్పీ 44 చోట్ల పోటీ చేస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంతా తానై ప్రచారం నిర్వహించారు.. ర్యాలీలు, సభలు, రోడ్‌షోలతో హోరెత్తించారు.. ఒక, తుది దశలో మొత్తం 2.51కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.29 కోట్ల మంది పురుషులు, 1.22కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే 18 నుంచి 19ఏళ్ల యువ ఓటర్లు 5.96లక్షల మంది ఉండటం గమనార్హం. రెండో దశ కోసం 14,975 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1.13లక్షల మంది పోలింగ్‌ సిబ్బందిని మోహరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • gujarat election
  • Gujarat Election 2022
  • Gujarat Election Second Phase Polling
  • PM Modi

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions