తమిళనాడు ఎన్నికల ముంగిట అసెంబ్లీలో కీలక పరిణామం జరిగింది. స్టాలిన్ సర్కార్-రాజ్‌భవన్ మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఆ యుద్ధ వాతావరణం మరోసారి బయటపడింది. మంగళవారం ఉదయం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే గవర్నర్ ఆర్ఎన్.రవి ప్రసంగంతో సభ ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే సభకు హాజరైన కొన్ని నిమిషాలకే వెనుదిరిగారు. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్‌గా దుమారం రేపుతోంది.

అసెంబ్లీ సమావేశాలకు ముందు జాతీయ గీతంతో సభ ప్రారంభం అవుతుంటుంది. అయితే జాతీయ గీతం కాకుండా.. రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. దీంతో గవర్నర్ ఆర్ఎన్.రవి ఆగ్రహంతో రగిలిపోయారు. వెంటనే పొడియం మీద నుంచి దిగిపోయి కారెక్కి వెళ్లిపోయారు. దీంతో సభ్యులంతా షాక్‌కు గురయ్యారు. గవర్నర్ ఇలా వెళ్లిపోవడం మూడోసారి. గతంలో కూడా రెండు సార్లు ఇలానే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
గవర్నర్ కార్యాలయం
ఇక గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడంతో గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మైక్రోఫోన్‌ను ‘‘పదేపదే స్విచ్ ఆఫ్ చేసింది’’ అని.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో ‘‘అనేక ఆధారాలు లేని వాదనలు, తప్పుదారి పట్టించే ప్రకటనలు.’’ ఉన్నాయని ఆరోపించింది. ‘‘ప్రజలను ఇబ్బంది పెడుతున్న కీలకమైన అంశాలను విస్మరించారు.’’ అని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది.
డీఎంకే ఖండన
ఇక గవర్నర్ రవి చర్యలను డీఎంకే ప్రభుత్వం ఖండించింది. 100 ఏళ్ల నాటి సభా సంప్రదాయాలను అగౌరవపరిచారని.. అవమానించారని పేర్కొంది. ఈ సందర్భంగా డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై ప్రస్తావించిన ‘‘మేకకు గడ్డం ఎందుకు అవసరం.. అలాగే రాష్ట్రానికి గవర్నర్ ఎందుకు అవసరం.’’ అని చెప్పిన మాటను గుర్తుచశారు. తన పరిపాలనలో గవర్నర్‌ను లేదా ఆయన కార్యాలయాన్ని ఏ విధంగానూ అగౌరవపరచలేదని.. కానీ తమిళ ప్రజలను గౌరవించడంలో గవర్నర్ విఫలమయ్యారని స్టాలిన్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Allari Naresh: అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం
మంగళవారం ఉదయం 9.30 గంటలకు సభ సమావేశమైంది. ప్రొటోకాల్ ప్రకారం.. గవర్నర్ ప్రారంభ ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది. అయితే జాతీయ గీతానికి బదులు.. రాష్ట్ర గీతం ఆలపించడంతో వెంటనే పొడియం దిగేసి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: మళ్లీ దుమ్మురేపుతోన్న వెండి, గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!