Site icon NTV Telugu

Google Maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. ఓరి దేవుడా జర్రుంటే సచ్చి పోయేటోళ్లు..

Google Maps

Google Maps

Google Maps: చాలా మంది గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తుంటారు. అయితే కొంతమంది గూగుల్ మ్యాప్స్ నే గుడ్డిగా నమ్ముతూ.. ప్రమాదాల్లో పడుతున్నారు. ఇప్పటికే ఈ యాప్‌ ఇచ్చే డైరెక్షన్స్ నమ్మి ఎంతోమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మహారాజ్‌ గంజ్‌లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడిపించడంతో అది కాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి తీసుకుపోయింది. కాగా, కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ వెళ్లాడు.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను మ్యాప్ గుర్తించకపోవడంతో.. కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది. ఈ ఘటన యూపీలోని జాతీయ రహదారి 24పై జరిగింది. అదృష్టవశాత్తూ కారులోని వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

Read Also: Raghurama Krishna Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. సజ్జలపై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదు..!

అయితే, యూపీలో గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గూగుల్ మ్యాప్స్ చూస్తూ ప్రయాణిస్తున్న ఓ కారు నదిలో పడిపోగా.. ఈ దుర్ఘటనలో ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు. బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని దాతాగంజ్‌కు వెళ్తుండగా ఫరీద్‌పూర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దెబ్బతిన్న వంతెన గురించి గూగుల్ మ్యాప్స్‌లో సమాచారం లేకపోవడంతో, డ్రైవర్ కారును దాని పైకి నడిపాడు. దీంతో వాహనం దాదాపు 50 అడుగుల లోతున్న నదిలో పడింది.

Exit mobile version