Google Maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్.. ఓరి దేవుడా జర్రుంటే సచ్చి పోయేటోళ్లు..
- గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ప్రమాదంలో పడిన ఓ కారు డ్రైవర్..
- యూపీలోని మహారాజ్‌గంజ్‌లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవింగ్..
- నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి కిందకు వేలాడిన కారు.. అందరూ సేఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Maps: చాలా మంది గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగిస్తుంటారు. అయితే కొంతమంది గూగుల్ మ్యాప్స్ నే గుడ్డిగా నమ్ముతూ.. ప్రమాదాల్లో పడుతున్నారు. ఇప్పటికే ఈ యాప్ ఇచ్చే డైరెక్షన్స్ నమ్మి ఎంతోమంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్‌లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడిపించడంతో అది కాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి తీసుకుపోయింది. కాగా, కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ వెళ్లాడు.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను మ్యాప్ గుర్తించకపోవడంతో.. కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది. ఈ ఘటన యూపీలోని జాతీయ రహదారి 24పై జరిగింది. అదృష్టవశాత్తూ కారులోని వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
Also Read
- Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
అయితే, యూపీలో గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గూగుల్ మ్యాప్స్ చూస్తూ ప్రయాణిస్తున్న ఓ కారు నదిలో పడిపోగా.. ఈ దుర్ఘటనలో ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు. బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని దాతాగంజ్‌కు వెళ్తుండగా ఫరీద్‌పూర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దెబ్బతిన్న వంతెన గురించి గూగుల్ మ్యాప్స్‌లో సమాచారం లేకపోవడంతో, డ్రైవర్ కారును దాని పైకి నడిపాడు. దీంతో వాహనం దాదాపు 50 అడుగుల లోతున్న నదిలో పడింది.
उत्तर प्रदेश – जिला महराजगंज में मोबाइल पर मैप लगाकर दौड़ रही कार एक निर्माणाधीन फ्लाईओवर पर रास्ता खत्म होने की वजह से लटक गई। गनीमत रही कि कार नीचे नहीं गिरी। pic.twitter.com/Lv8u4PNQT2
— Sachin Gupta (@SachinGuptaUP) June 9, 2025
తాజావార్తలు
-
SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
-
Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఇవే!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!