ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో విద్యా శాఖ సమస్యలను తెలుసుకోవడానికి సోమవారం జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఆన్‌లైన్‌లో జరిగింది. ఈ సమయంలో, గూగుల్ మీట్‌తో అనుసంధానించబడిన ఒక వ్యక్తి సమావేశం సమయంలో ఒక అశ్లీల వీడియోను ప్లే చేశాడు. అయితే, స్క్రీన్‌పై వీడియో ప్లే అవుతున్నట్లు చూసిన వెంటనే, డిఎం దానిని ఆపివేసి, ఎస్పీతో మాట్లాడుతూ, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సైబర్ పోలీసులను ఆదేశించారు. Also Read:Ram Gopal…
నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ ఘటన. ప్రేమించిన ప్రియురాలితో కలిసి బ్రతకాలని కలలకన్నాడు. కానీ విధి ఆడిన వింతనాటకంలో ప్రియురాలిని కోల్పోయాడు. అయితే ఇచ్చిన మాట కోసం తన ప్రేయసి మృతదేహాన్ని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా చోటుచేసుకుంది. వివాహం చేయడానికి వచ్చిన పురోహితుడు వేద మంత్రాలు పఠించి వివాహాన్ని పూర్తి చేశాడు. మంగళగీత్ పాడటానికి బదులుగా, మహిళలు శోక సంద్రంలో మునిగిపోయారు. Also Read:Israel-Iran War: ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలు తిరస్కరించిన…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్‌లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడిపించడంతో అది కాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి తీసుకుపోయింది. కాగా, కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ వెళ్లాడు.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను మ్యాప్ గుర్తించకపోవడంతో.. కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది.
ఓ వివాహిత తన ప్రియుడి వల్ల మూడోసారి గర్భం దాల్చిన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌లో వెలుగుచూసింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయం ఆ మహిళ భర్తకు కూడా తెలియదు. భర్త లేకపోవడంతో ఆ మహిళ మూడోసారి గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు పిల్లల తల్లి, ఏడు నెలల గర్భిణి భర్తను వదిలేసి గుడిలో ప్రియుడితో పెళ్లి చేసుకుంది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ ఘుగ్లీలో నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఓ యువకుడిని గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేశారు.
Stray Dogs Attack: కుక్కల దాడుల్లో అమాయకపు పిల్లలు దారుణంగా మరణిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కుక్కల దాడుల వల్ల చాలా మంది మరణించారు. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ మహారాజ్ గంజ్ ప్రాంతంలో వీధికుక్కల దాడుల్లో 11 ఏళ్ల బాలుడు బలయ్యాడు. మహారాజ్‌గంజ్‌లోని శాస్త్రి నగర్ ఇంటర్మీడియట్ కళాశాల మైదానంలో 11 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు కొట్టి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.