Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Golden Joint Of Worlds Highest Railway Bridge Inaugurated In Jammu And Kashmir

World Highest Railway Bridge: కశ్మీర్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన

Published Date :August 13, 2022 , 7:50 pm
By Mahesh Jakki
World Highest Railway Bridge: కశ్మీర్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన
  • Follow Us :
  • google news
  • dailyhunt

World Highest Railway Bridge: చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన గోల్డెన్ జాయింట్‌ను శనివారం ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉంది. కత్రా-బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ వంతెన కీలకమైన అనుసంధానంగా నిలుస్తోంది. ఈ వంతెనను గోల్డెన్‌ జాయింట్‌గా పిలుస్తున్నారు. ఈ వంతెన చివరల నుంచి ఒక విల్లు ఆకారంలో ఉన్న నిర్మాణం.. బ్రిడ్జి మధ్యలో కలుసుకుంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానం చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. ఆ రాష్ట్రంలోని రియాసి జిల్లాలో 1.3కిమీ పొడవున్న చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను మోడీ ప్రభుత్వం నిర్మించింది. ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

2002లో ఈ బ్రిడ్జి్ నిర్మాణ పనులు ప్రారంభమైనా.. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా నిలిచిపోయాయి. మళ్లీ 2017 నవంబర్‌లో మెయిన్ ఆర్చ్ పనులు ప్రారంభమయ్యాయి. 2019 చివరినాటికి పూర్తి చేయాలని అధికారులు భావించినా..2018లో కాంట్రాక్టు సమస్యల కారణంగా జాప్యం జరిగింది. కరోనా​ వల్ల మరింత ఆలస్యమైంది. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 1,315 మీటర్లు. 17 వ్యాసార్థాలల్లో దీనిని నిర్మించారు. ఉధంపూర్‌- శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే సెక్షన్‌లో ఈ లైన్‌ను రూ.1,486 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ బ్రిడ్జి జమ్మూ కశ్మీర్‌లోని బక్కల్‌, కౌరి మధ్య చీనాబ్‌ నదిపై అనుసంధానంగా ఉంటుంది. ఈ వంతెన గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలులను కూడా తట్టుకోగలదు. దీని జీవిత కాలం 120 సంవత్సరాలు ఉంటుంది.

Tamilnadu CM Stalin: ఏపీ సీఎం జగన్‌కు లేఖ.. ఆ ఆనకట్టల నిర్మాణం ఆపాలని డిమాండ్

ఈ బ్రిడ్జి బ‌రువు బరువు 10,619 మెగా టన్నులు అని తెలిపారు. ఈ వంతెన నిర్మాణంలో 28,660 మెగా టన్నుల ఉక్కును వినియోగించారు. ఈ బ్రిడ్జి మొత్తం 7 పిల్లర్లను కలిగి ఉండగా సంగల్‌దాన్ వద్ద ఉన్న పిల్లర్ అన్నింటికన్నా ఎత్తులో 103 మీటర్లు ఉంటుంది. దీన్ని ఆఫ్కాన్స్‌ సంస్థ నిర్మించింది. ఈ ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇప్పుడు పూర్తయింది. కుతుబ్‌మినార్‌ కంటే ఎత్తైన ఈ నిర్మాణం.. బంగీ జంపింగ్‌ లాంటి సాహసోపేతమైన క్రీడలకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఈ వంతెన పర్యాటకంగా జమ్ముకశ్మీర్‌ను మరింత ఉన్నత స్థితిలో ఉంచుతుందని తెలిపారు. చీనాబ్ వంతెనతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని ప్రమాదకరమైన భూభాగంలో కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్) కోసం ఆఫ్కాన్స్ 16 అదనపు రైల్వే వంతెనలను నిర్మిస్తోంది. అన్ని వంతెనలు ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరకు రవాణా ట్రక్కులకు 48 గంటల సమయం పడుతుండగా.. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే రైళ్ల ద్వారా కేవలం 20 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chenab river
  • Golden Joint
  • jammu kashmir
  • railway bridge
  • River Chenab valley

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions