Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
- తక్కువ ధర బంగారం పేరుతో భారీ మోసం
- బాధితులకే నకిలీ చెక్కు, ఐఫోన్ల డ్రామా
- పారిపోతుండగా షాద్‌నగర్ వద్ద అరెస్ట్
- మరిన్ని బాధితుల కోసం పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Scam : తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ అమాయకులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్య భాయ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, నీలోఫర్ ప్రాంతాలకు చెందిన బాధితుల నుండి దాదాపు రూ.30 లక్షలు వసూలు చేసిన సూర్య భాయ్, ఆ తర్వాత బంగారం ఇవ్వకుండా ముఖం చాటేశాడు. బాధితులు అతడి ఇంటికి వెళ్లి నిలదీయడంతో.. తన వద్ద ఉన్న మూడు ఐఫోన్ల విలువ రూ.10 లక్షలని చెబుతూ వాటితో పాటు రూ.20 లక్షల నకిలీ చెక్కు ఇచ్చి పంపించేశాడు. ఆ తర్వాత అంతటితో ఆగకుండా, బాధితులే తనను బెదిరించి ఫోన్లు లాక్కెళ్లారంటూ ఏకంగా వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసి నయా డ్రామాకు తెరతీశాడు. అయితే, బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేయగా సూర్య భాయ్ చేసిన అసలు మోసం బయటపడింది.
ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడంతో, అరెస్ట్ భయంతో సూర్య భాయ్ హైదరాబాద్ నగరం విడిచి పారిపోవడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టగా, హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వైపు పారిపోతుండగా పోలీసులు అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ‘గోల్డ్ మ్యాన్’ను రిమాండ్‌కు తరలించి, ఇప్పటివరకు ఇతడు ఎంతమందిని ఇలా బురిడీ కొట్టించాడనే కోణంలో నిశితంగా విచారిస్తున్నారు. అమాయక ప్రజలు ఇటువంటి గుడ్డి నమ్మకాలతో తక్కువ ధర బంగారమంటూ వచ్చే మోసగాళ్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!