Sonali Phogat: సోనాలీ ఫోగాట్ నివాసంలో 3 డైరీలు స్వాధీనం.. వాటిలో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonali Phogat: బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సంత్‌నగర్ ప్రాంతంలో గల దివంగత నటిసోనాలి ఫోగాట్ నివాసంలో గోవా పోలీసులు వరుసగా మూడో రోజు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నారు. సోనాలి ఫోగాట్ బెడ్‌రూమ్, వార్డ్‌రోబ్, పాస్‌వర్డ్ రక్షిత లాకర్‌ను పోలీసు సెర్చ్ టీమ్ తనిఖీ చేసింది. సోనాలి ఫోగాట్ నివాసంలోని లాకర్‌ను కూడా పోలీసులు సీల్ చేశారు.
ఈ డైరీల్లో ఏముందనే విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. ఇందుల్లో తన వ్యక్తిగత సహాయకుడైన సుధీర్ సంగ్వాన్ ద్వారా జరిపిన లావాదేవీల వివరాలు అందులో రాసుకున్నారని సమాచారం. హరియాణా సహా పలు రాష్ట్రాల్లో సోనాలీ పెట్టుబడుల వివరాలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. సోనాలీ ఫోగాట్ మృతి కేసు ఇంకా కొలిక్కి రాలేదని.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని గోవా పోలీసులు వెల్లడించారు.
Also Read
- NEET Case: పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
- Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
Sukesh Chandrashekar Case: నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
గోవా పర్యటనకు వెళ్లిన సోనాలి అనుమానాస్పద రీతిలో మృతి ప్రాణాలు కోల్పోయింది. తొలుత గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని, అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. సోనాలీ తన సహాయకుడైన సుధీర్‌తో సహజీవనం చేశారనే వార్తలు వస్తున్నాయి. వారిద్దరు కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారని కథనాలు వెలువడ్డాయి. ఆస్తి కోసమే ఆమె హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసులో మరో మలుపు తిరిగింది.
తన టిక్‌టాక్ వీడియోలతో ఖ్యాతి గడించిన నటి సోనాలీ ఫోగాట్, 2019 హర్యానా ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఓడిపోయారు. ఆమె 2020లో బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా కనిపించింది.
తాజావార్తలు
-
NEET Case: పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
-
Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..