Site icon NTV Telugu

UP: ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి చంపేసిన ప్రియురాలు.. అసలేమైందంటే..!

Up

Up

ఉత్తరప్రదేశ్‌లో దారుణంగా జరిగింది. ప్రియుడిని ఇంటికి పిలిచి.. అత్యంత దారుణంగా భర్త కలిసి ప్రియురాలు హతమార్చింది. సంభాల్‌లో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రయీస్ అహ్మద్, సితార భార్యభర్తలు. అనిష్(45) అనే యువకుడితో సితారకు సంబంధం ఉంది.  అయితే ఇటీవల అనిష్‌కు పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో అనిష్‌ను ఇంటికి పిలిచిన సితార.. భర్తతో కలిసి స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేసింది.

ఇది కూడా చదవండి: INDIA Bloc: ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమి నిర్ణయం! ఖర్గే మంతనాలు

బాధిత కుటుంబం మాట్లాడుతూ.. అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు హత్య చేశారని ఆరోపిస్తూ ఉంటే.. వివాహేతర సంబంధంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. అయితే సితార.. తన ప్రియుడ్ని ఎందుకు చంపిందో అర్థం కావడం లేదని పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Kiara : నువ్వు నా ప్రపంచానే మార్చేశావ్.. కియారా పోస్ట్ వైరల్

అనిష్ తండ్రి ముస్తాకిమ్ మాట్లాడుతూ.. కుమారుడిని దారుణంగా హత్య చేశారని.. చేతులు, కాళ్ళు విరిచి.. బట్టలు విప్పి చంపేశారని చెప్పాడు. ఇంటికి పిలిచి చంపేశారని వాపోయాడు. అనిష్‌కు వివాహం ఖరారైందని.. సంవత్సరాల క్రితం అప్పుగా ఇచ్చిన రూ. 7 లక్షలు అడగడానికి పొరుగింటికి వెళ్లాడని చెప్పాడు. తీవ్రంగా గాయపడిన అనిష్ తప్పించుకుని ఇంటికి వచ్చాడని.. ఇంటి దగ్గర చనిపోయాడని పేర్కొన్నాడు.

హత్య కేసు కింద దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. విచారణ సమయంలో అనిష్, సితార మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇంటికి ఆహ్వానించి చంపేశారన్నారు. హత్య కుట్రలో సితార ఎందుకు చేరిందో స్పష్టంగా తెలియదన్నారు.

Exit mobile version