Gas Cylinder Priced Hiked: యుద్ధం వేళ కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వంటింటి గ్యాస్ ధర
- యుద్ధం వేళ కేంద్రం షాక్
- భారీగా పెరిగిన వంటింటి గ్యాస్ ధర
- మరింత పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు కేంద్రం షాకిచ్చింది. వంటింట్లో గ్యాస్ ధర పెంపుతో ఝలక్ ఇచ్చింది. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరపై ఏకంగా రూ.60 పెంచింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచింది. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.965కి చేరింది.
అయితే ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు కేంద్రం ఊరట కలిగించింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు సమాచారం.
Also Read
- Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
ఫిబ్రవరి 28 నుంచి మధ్యప్రాచ్యంలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. పైగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ధరల పెరుగుదలకు కారణమైంది. మరిన్ని రోజులు యుద్ధం కొనసాగితే మాత్రం ధరలు కొండెక్కడం ఖాయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రం చెబుతున్నప్పటికీ ధరలు పెరగడం ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి.
గృహ వినియోగ సిలిండర్ ధర ఏప్రిల్ 2025 నుంచి పెరగలేదు. భీకర యుద్ధం జరుగుతున్న కారణంగా పెరిగినట్లుగా తెలుస్తోంది. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల గృహ LPG సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913 కు పెరిగింది. ముంబైలో రూ.912.50గా ఉంది. చెన్నైలో రూ.928.50కి పెరిగింది.
తాజావార్తలు
-
Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!