Emmanuel Macron: ముంబై రోడ్లపై సామాన్యుడిలా ఫ్రెంచ్ అధ్యక్షుడు జాగింగ్.. వీడియో వైరల్
- ముంబై రోడ్లపై ఫ్రెంచ్ అధ్యక్షుడు జాగింగ్ సామాన్యుడిలా మారిపోయిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్
- ముంబై రోడ్లపై ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జాగింగ్
- గుర్తుపట్టలేకపోయిన స్థానికులు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నాలుగు రోజుల భారత్ పర్యటన కోసం మంగళవారం తెల్లవారుజామున ముంబైకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఇక హోటల్‌కు చేరుకున్నాక మాక్రాన్ సామాన్యుడిలా మారిపోయారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లోకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా జాగింగ్‌కు వచ్చేశారు. ఉదయాన్నే వాకింగ్ చేసే ముంబై వాసులంతా ఆశ్చర్యపోయారు. ఈ హఠాత్తు పరిణామంతో షాకైన ప్రజలు మొబైల్స్‌లో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: UP: ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి
Also Read
- Telegram Ban in India: భారత్‌లో టెలిగ్రామ్‌పై నిషేధం ఎందుకు..? వివాదానికి కారణమైన 5 కీలక ఫీచర్లు ఇవే
- Annamalai: తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..
- Donald Trump: భారత్‌పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
మంగళవారం ఉదయం ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో యధావిధిగా ముంబై వాసులు వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో కొంత మందితో కలిసి మాక్రాన్ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చింది అధ్యక్షుడు అని తెలియక స్థానికులు అవాక్కయ్యారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా రావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా మంది మాక్రాన్ అన్న విషయం గుర్తించలేకపోయారు. ఆయన కూడా హాయ్.. చెప్పుకుంటూ సామాన్యుడిలానే వెళ్లిపోయారు. మొత్తానికి మాక్రాన్ అన్న విషయం తెలిశాక మొబైల్స్‌లో బంధించారు.
ఇది కూడా చదవండి: Bill Gates: ఎప్స్టీన్ ఫైల్ ఎఫెక్ట్.. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం!
ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటించేందుకు వచ్చారు. భారతదేశం నిర్వహించే ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొంటారు. అలాగే ముంబైలో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. రక్షణ సహకారం, శక్తి, స్టార్టప్ భాగస్వామ్యాలు, ఆర్థిక పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించనున్నారు. మాక్రాన్ భారతదేశానికి రావడం ఇది నాల్గోసారి. ముంబైలో పర్యటించడం మాత్రం ఇదే తొలిసారి.
ఆ మధ్య అమెరికాలో పర్యటించినప్పుడు కూడా మాక్రాన్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ట్రంప్ కాన్వాయ్ వెళ్లడంతో నడిరోడ్డుపై ఆగిపోయారు. దీంతో వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి కాన్వాయ్ కారణంగా రోడ్డుపై ఆగిపోయినట్లు తెలిపారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయింది.
Mumbai: French President Emmanuel Macron seen jogging at Marine Drive. pic.twitter.com/lgVhz5cBt1
— IANS (@ians_india) February 17, 2026
Mumbai: French President Emmanuel Macron departs from the Taj Hotel pic.twitter.com/WiYnoDfmXj
— IANS (@ians_india) February 17, 2026
🇮🇳🇫🇷
Bienvenue à Mumbai!A very warm welcome to the President of France, H.E. Emmanuel Macron and First Lady Brigitte Macron as they arrive in Mumbai!
Maharashtra welcomes you!Wishing Hon President Macron and the entire French delegation a pleasant stay and a successful… pic.twitter.com/h0CrOc90OG
— Devendra Fadnavis (@Dev_Fadnavis) February 16, 2026
తాజావార్తలు
-
KTR : ఒక్క ఓటు కూడా పోవద్దు.!
-
Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయం.. సిరీస్ కైవసం..
-
Peddi : థియేటర్లలో ‘పెద్ది’ సరికొత్త రచ్చ.. రేపటి నుంచి 6 నిమిషాల కొత్త సీన్స్ లోడింగ్,
-
US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!